ఫిరాయింపుల భయం: చెన్నైకి తరలిని ఐదుగురు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
పనాజి: గోవా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల పరిస్థితి గందరగోళంగా మారింది. పార్టీలో ఉంటున్నారా? లేక బీజేపీలో చేరుతున్నారా? అనే సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఐదుగురు ఎమ్మెల్యేలను తమిళనాడు రాజధాని చెన్నైకి తరలించారు.
గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంకల్ప్ అమోంకర్, ఆల్టన్ డోస్తా, కార్లోస్ అల్వార్స్, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్, యురి అలేమోను చెన్నైకి తరలించినట్లు సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని సొంత కాంగ్రెస్ నేతలే పుకార్లు సృష్టించారని ఆరోపిస్తూ.. అసెంబ్లీలో సభాపక్ష నేతగా ఉన్న మైఖేల్ లోబోను ఆ పదవి నుంచి కాంగ్రెస్ తప్పించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించినట్లు తెలుస్తోంది. పార్టీని బలహీనపర్చేందుకు కొంతమంది నాయకులు కుట్రపన్నారని గోవా కాంగ్రెస్ ఇంఛార్జీ దినేశ్ గుండురావు తెలిపారు. ఫిరాయింపులతోపాటు గోవాలో కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకుగానూ బీజేపీతో కలిసి సొంతనేతలే కొందరు కుట్ర పన్నారని చెప్పారు. ఈ కుట్రకు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్ నాయకత్వం వహించారని ఆరోపించారు.
కాగా, మరో ఐదుగురు ఎమ్మెల్యేలను చెన్నైకి ఎందుకు తీసుకెళ్లారో తనకు తెలియదని మైఖేల్ లోబో అన్నారు. "నన్ను ఆహ్వానించలేదు. వారిని చెన్నైకి ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు" అని ఆయన పీటీఐకి తెలిపారు.
We have not shifted any MLA's.
— Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) July 16, 2022
The 5 @INCIndia MLA's have gone to Chennai voluntarily to avoid the incessant attempts, continuous calls, pressure tactics and threats being made by @DrPramodPSawant & @BJP4India to engineer a split in @INCGoa. https://t.co/X57buS6Xas
మరో మీడియాతో మాట్లాడుతూ.. ఐదుగురు ఎమ్మెల్యేలలో ఒకరు శుక్రవారం రాత్రి చెన్నైకి బయలుదేరినట్లు చెప్పారు. గోవా కాంగ్రెస్ చీఫ్ అమిత్ పార్కర్ మాట్లాడుతూ.. జరుగుతున్న పరిణామాలు తనకు తెలియవని అన్నారు. "రేపు మీటింగ్ పెడతాం. ఈ పరిణామాల గురించి నాకు తెలియదు, సోమవారం ఏమి జరుగుతుందో చూద్దాం, "అని పాట్కర్ అన్నారు.
"ఈ విషయంపై నాకు ఎలాంటి వ్యాఖ్య లేదు. నాకు ఇప్పుడు పార్టీలో అధికారిక బాధ్యత లేదు, కాబట్టి నేను దీనిపై వ్యాఖ్యానించలేను. ఎమ్మెల్యేలను ఎవరినైనా కలవడానికి చెన్నైకి పిలిచి ఉండవచ్చు" అని గోవా మాజీ ముఖ్యమంత్రి బీజేపీలోకి ఫిరాయింపులకు పాల్పడ్డారని గత వారం ఆరోపించిన దిగంబర్ కామత్ ఇండియా టుడే టీవీతో అన్నారు.












Click it and Unblock the Notifications