Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముప్పేట దాడిలో కాంగ్రెస్

దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రాజ్యాంగ సంరక్షక పాత్రను పోషించడానికి తంటాలు పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగాన్ని గానీ, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ ను గానీ ఏనాడూ గౌరవించని ఆ పార్టీ ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం సహేతుకం కాదని బీజేపీ విమర్శిస్తోంది.

ప్రజాస్వామ్య సంస్థలను అణచివేయడం మొదలుకుని, రాజ్యాంగ ప్రాథమిక హక్కుల వరకు కాంగ్రెస్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి. బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ గౌరవించలేదు. ఆయన దార్శనికతను స్వీకరించడానికి సిద్ధపడలేదు.

Congress has repeatedly disrespected both the principles and the Constitution

దీనికి బదులుగా అంబేద్కర్ వాదాన్ని నిరంతరం బలహీనపరిచిందని అంటున్నారు. ఈ నిర్లక్ష్య పూరక విధానాలు.. అంబేద్కర్ భావజాలానికే పరిమితం కాలేదు. అంబేద్కర్ జీవితకాలంలో ఆయనను ఎలా నిరంతరం వ్యతిరేకించిందో చూస్తే, ఆయన వారసత్వాన్ని కాపాడతామని కాంగ్రెస్ చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది.

ఇప్పుడు ఆయన వారసులమని చెప్పుకొంటోన్న కాంగ్రెస్ పార్టీ.. ఒకప్పుడు ఆయనను అధికారం నుండి దూరంగా ఉంచడానికి, ఆయన గొంతును అణచివేయడానికి చేయగలిగినదంతా చేసింది.

1930లో- అంబేద్కర్ లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై దళితుల తరపున మాట్లాడినప్పుడు, కాంగ్రెస్ దానిని బహిష్కరించింది. ఆ తరువాత.. న్యాయమైన ప్రాతినిధ్యం కోసం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని ఆయన డిమాండ్ చేసినప్పుడు, మహాత్మా గాంధీ, కాంగ్రెస్ దానిని తీవ్రంగా వ్యతిరేకించాయి. తాము మాత్రమే దళితులతో సహా భారతీయులకు ప్రాతినిథ్యం వహించాలని పట్టుబట్టింది కాంగ్రెస్.

అంబేద్కర్ రాజ్యాంగ సభలోకి ప్రవేశించడాన్ని కూడా కాంగ్రెస్ అడ్డుకుంది. బెంగాల్, ముస్లిం లీగ్ మద్దతు కారణంగానే ఆయన పెద్దల సభకు ఎంపికయ్యారు. ఇప్పుడు ప్రచారాలలో ఆయన ఇమేజ్‌ను ఉపయోగించుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. దేశ విభజన తర్వాత కూడా, ఆయనకు కొత్త సీటు అవసరమైనప్పుడు, కాంగ్రెస్ ఆయనను బొంబాయి నుండి అనుమతించింది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన పాత్రను అయిష్టంగానే అంగీకరించింది.

దేశ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు వంటి సంస్కరణలను తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇది మహిళల హక్కులను మెరుగుపరిచేది. కాంగ్రెస్ దానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. ఫలితంగా 1951లో అంబేద్కర్ రాజీనామా చేశారు.

ఆ తరువాతి ఎన్నికలలోనే, కాంగ్రెస్ ఆయనపై అభ్యర్థులను నిలబెట్టింది. నెహ్రూ స్వయంగా అంబేద్కర్ ను ఓడించాలని ప్రచారం చేశారు. అంబేద్కర్ 1952, మళ్ళీ 1954లో ఓడిపోయారు. 1956లో ఆయన మరణించినప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన భౌతికకాయానికి అధికారిక రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు.

జాతీయ గౌరవాన్ని గానీ, భారతరత్న గానీ ఇవ్వడానికి కాంగ్రెస్ ముందుకు రాలేదు. సంవత్సరాలుగా స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించ లేదు కాంగ్రెస్. పార్లమెంట్ లో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి ప్రజా ఉద్యమాలు అవసరం అయ్యాయి. అంబేద్కర్ ఆదర్శాలను నిలబెట్టామని చెప్పుకునే పార్టీకి అంబేద్కర్ ను అగౌరవపరిచిన సుదీర్ఘ చరిత్ర ఉంది.

ప్రజాస్వామ్య విలువలకు పూర్తి ద్రోహం చేసే సంఘటనలు లేకపోలేదు. ఇందిరా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 25, 1975న విధించిన అత్యవసర పరిస్థితి దీనికి నిదర్శనం. 21 నెలల కాలం సంపూర్ణ అధికారం సంపూర్ణంగా ఎలా అవినీతికి దారితీస్తుందో పాఠ్య పుస్తకాల్లో ఉదాహరణగా మారింది.

ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులు అణచివేతకు గురయ్యాయి. హెబియస్ కార్పస్ సస్పెండ్ అయింది. న్యాయవ్యవస్థ నోరు మూతపడింది. పత్రికలు సెన్సార్ కు గుయ్యాయి.

ప్రతిపక్షాలకు జైలు శిక్ష- అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ, జయప్రకాష్ నారాయణ్ వంటి నాయకులు, జర్నలిస్టులతో సహా లక్ష మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టారు. కుటుంబాలు నాశనం అయ్యాయి. దేశాన్ని భయానక వాతావరణం ఆవరించి ఉంది.

బలవంతపు స్టెరిలైజేషన్లు: సంజయ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్రూరమైన జనాభా నియంత్రణ చర్యలను అమలు చేసింది. లక్షలాది మంది ప్రజలు, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు బలవంతంగా స్టెరిలైజేషన్ చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన.

రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరించారు: అత్యవసర పరిస్థితి సమయంలో, రాజ్యాంగ తిరుగుబాటుగా భావించే 42వ సవరణను కాంగ్రెస్ ఆమోదించింది. ఇది ప్రజా సంప్రదింపులు లేకుండానే "సోషలిస్ట్" మరియు "లౌకిక" అనే పదాలను ప్రవేశికలో చేర్చింది. ఇది రాజ్యాంగ స్వభావాన్ని ప్రాథమికంగా మార్చివేసింది.

దళితులకు నిజమైన సాధికారత లేదు: 50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించినప్పటికీ, కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ వర్గాల అభ్యున్నతిలో పెద్దగా పురోగతి సాధించలేదు. బదులుగా, వారి విధానాలు సామాజిక న్యాయం గురించి పెదవి విప్పుతూనే అణగారిన వారి కోసం కాంగ్రెస్ చేసింది శూన్యమే.

మతమార్పిడిపై హెచ్చరికలను విస్మరించారు: అంబేద్కర్ సామాజిక సంస్కరణల కోసం వాదిస్తూనే, బలవంతంగా మతమార్పిడులకు వ్యతిరేకంగా హెచ్చరించారు. ముఖ్యంగా భారతీయ సాంస్కృతిక విలువలతో కలిసిపోని విశ్వాసాలకు వ్యతిరేకంగా. కాంగ్రెస్ ఈ ఆందోళనలను విస్మరించడమే కాకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన బుజ్జగింపులను ప్రోత్సహించింది.

దీనికి భిన్నంగా వ్యవహరించింది బీజేపీ. దళితులు, అణగారిన వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను గౌరవించడానికి బీజేపీ ప్రభుత్వం అనేక స్పష్టమైన చర్యలు తీసుకుంది. విధానపరమైన, సంస్థాగత కార్యక్రమాల ద్వారా దాన్ని చేతల్లో చూపించింది.

అంబేద్కర్ స్మారక చిహ్నాలు, రాజ్యాంగ దినోత్సవం: పంచతీర్థ చొరవ, రాజ్యాంగ దినోత్సవ గుర్తింపు, ఢిల్లీలో అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రం అభివృద్ధి ఆయన వారసత్వాన్ని కాపాడుకోవడంలో బీజేపీ నిబద్ధతకు నిదర్శనాలు.

సంక్షేమ కార్యక్రమాలు: బీజేపీ ప్రభుత్వాల హయాంలో, స్టాండ్-అప్ ఇండియా, ముద్ర యోజన, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు దళితులు, గిరిజనులు, ఓబీసీలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చాయి. అంబేద్కర్ సాధించిన సామాజిక న్యాయ కలను ఇవి సాకారం చేశాయి.

రాజకీయ ప్రాతినిధ్యం: బీజేపీ అణగారిన వర్గాల నాయకులను ఉన్నత పదవులకు ఎంపిక చేసింది. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నుండి అనేకమంది మంత్రులు, ముఖ్యమంత్రుల వరకు బీజేపీ నిబద్ధత కనిపిస్తుంది. కాంగ్రెస్ కపటత్వానికి అద్దం పట్టడం అత్యవసర పరిస్థితికి క్షమాపణ చెప్పాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.

ఒకప్పుడు స్వేచ్ఛకు సంకెళ్లు వేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం కోసం పాటుపడినట్లుగా వ్యవహరించడం సరికాదని చాలామంది భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+