• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అది బీజేపీ నకిలీ టూ‌ల్‌కిట్, నడ్డాపై కేసు -మోదీజీ.. అబద్ధాలు ఆపి జనం ప్రాణాలు కాపాడండి: కాంగ్రెస్ ఎదురుదాడి

|

కరోనా విలయం చుట్టూ నెలకొన్న రాజకీయాలు రోజురోజుకూ మరింత అసహ్యకరంగా మారుతున్నాయి. పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు పోతోంటే అధికార బీజేపీ మాత్రం విపక్షాలపై రంధ్రాణ్వేషణలు చేస్తోంది. ఈ క్రమంలోనే వెలుగుచూసిన టూ‌ల్‌కిట్ ఉదంతంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం తీవ్రస్థాయిలో వాదులాడుకుంటున్నాయి. భారత్ లో కరోనా ఇప్పటిదాకా ఒక ఎత్తు, రాబోయే 2వారాలు మరో ఎత్తని, ఎన్నికల రాష్ట్రాల్లో వైరస్ విస్పోటనం చూడబోతున్నామని సైంటిస్టులు హెచ్చరిస్తున్న వేళ కొవిడ్ పై రాజకీయాలు తారాస్థాయికి చేరాయి..

షాకింగ్: మోదీ వేరియంట్ కరోనా -ప్రధాని పరువుతీస్తూ కాంగ్రెస్ టూల్‌కిట్ -బీజేపీ సంచలన ఆరోపణలుషాకింగ్: మోదీ వేరియంట్ కరోనా -ప్రధాని పరువుతీస్తూ కాంగ్రెస్ టూల్‌కిట్ -బీజేపీ సంచలన ఆరోపణలు

కొవిడ్ సంక్షోభం నేపధ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ఓ ''నకిలీ టూ‌ల్‌కిట్''ను సృష్టించిందని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. ఇందుకుగానూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలపై కేసులు పెడతామని కాంగ్రెస్ హెచ్చరించింది. ప్రధాని మోదీ ప్రతిష్టను దిగజార్చడానికి కాంగ్రెస్ 'టూ‌ల్‌కిట్' రూపొందించిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బయటపెట్డడంతో ఈ వివాదం రాజుకుంది..

Congress hit back on BJP over toolkit row, files complaint on Nadda others, priyanka gandhi reacts

కొవిడ్ సంక్షోభాన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన ప్రధాని మోదీ, బీజేపీలు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోడానికి ఇతరులపై నిందలు వేస్తున్నదని, అందులో భాగంగానే నకిలీ టూ‌ల్‌కిట్ రూపొందించిందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తమ ట్విటర్ హ్యాండిల్ ద్వారా సమాజిక కార్యక్రమాలు చేస్తుంటే... బీజేపీ మాత్రం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది.

రఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలురఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలు

నకిలీ టూ‌ల్‌కిట్ ఉదంతాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నదని, దీనిపై బీజపీ చీఫ్ జేపీ నడ్డా, సంబిత్ పాత్రలపై ఫోర్జరీ కేసు పెడతామని కాంగ్రెస్ రీసెర్చ్ విభాగం చీఫ్ రాజీవ్ గౌడ పేర్కొన్నారు. కరోనా కోరల్లో చిక్కుకున్న దేశ ప్రజలకు సహాయక కార్యక్రమాలు అందించాల్సింది పోయి బీజేపీ ''సిగ్గులేకుండా'' ఫోర్జరీలకు తెగబడుతోందంటూ ఆయన మండిపడ్డారు.

Congress hit back on BJP over toolkit row, files complaint on Nadda others, priyanka gandhi reacts

కరోనా వేళ దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ పరువును పాడుచేస్తూ కాంగ్రెస్ టూల్ కిట్ రూపొందించిందని, వైరస్ ను మోదీ వేరియంట్ గా పిలవాలని కాంగ్రెస్ తన శ్రేణులకు పిలుపునిచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చేసిన ఆరోపణలు నిరాధరమైనవని, డాక్యుమెంట్లు లేకుండా బీజేపీ చేసిన ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనటే పేర్కొన్నారు. మరోవైపు

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంక గాంధీ వాద్రా సైతం టూల్ కిట్ వివాదంపై ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలు విడుదల చేసిన టూల్ కిట్ నకిలీదని పేర్కొన్న ఆమె ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, కమలనాథులకు కీలక సూచన చేశారు. ''అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలయాపన మానుకోండి.. ఇకనైనా మేలుకుని ప్రజల ప్రాణాలు కాపాడండి..'' అని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

English summary
A war of words erupted on Tuesday between the BJP and the Congress after the former accused the latter of using the COVID-19 pandemic to malign Prime Minister Narendra Modi's image. Hitting back at the BJP, Congress accused it of propagating a fake ‘toolkit' and filed a complaint with the Delhi Police Commissioner against BJP chief JP Nadda, Union minister Smriti Irani and several others from the saffron camp. Priyanka Gandhi Vadra on alleged Congress toolkit, suggests bjp to Don't waste time spreading lies, start saving lives
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X