వాద్రా ఇష్యూ: మోడీ ఆరోపణపై స్పందించిన ఖుర్షీద్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ధీటుగా జవాబిచ్చింది. సోమవారం హర్యానాలో ఎన్నికల ప్రచారం ర్యాలీలో మాట్లాడుతూ డీఎల్‌ఎఫ్, రాబర్ట్ వాద్రా మధ్య జరిగిన వివాస్పద భూకేటాయింపులను హర్యానా ప్రభుత్వం అనుమతివ్వడంపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు.
ప్రధాని మోడీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ ధీటుగా స్పందించారు. మోడీ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని... ఆయన ప్రసంగం భాజపా కార్యకర్తలను, మద్దతుదారులను ఉత్తేజపరచే విధంగా ఉందని అన్నారు.

ఐదే ప్రచార ఎన్నికల్లో మోడీ జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. రాబర్ట్ వాద్రా, డీఎల్‌ఎఫ్‌ల మధ్య జరిగిన 58 కోట్ల భూకేటాయింపులు 2012 అక్టోబర్‌లో ఐఎఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా రద్దు చేశారు. అక్టోబర్ 15న హర్యానా రాష్టానికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications