లోక్ సభ ఎన్నికలు 2019 దెబ్బ: ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుల పంచాయితీ, జేడీఎస్ కు 10 సీట్లు !
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల 2019 షెడ్యూల్ తేదీ ప్రకటించిన తరువాత అన్ని పార్టీల నాయకులు అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీబిజీ అయ్యారు. ఢిల్లీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తుది జాబితాను తయారు చేసి ప్రకటించాలని సిద్దం అవుతున్నారు.
ఢిల్లీ హైకమండ్ నేతలకు అభ్యర్థుల జాబితాను ఇవ్వడానికి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ నివేదిక సిద్దం చేసి తీసుకుని ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తిక్కాట మొదలైయ్యింది. కొన్ని లోక్ సభ స్థానాల్లో నువ్వానేనా అంటూ కొందరు నాయకులు పొటీ పడుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంపిణి విషయంలో నాయకుల మద్య పోటీ ఎక్కవ అయ్యింది. ఒక్క లోక్ సభ సీటు నుంచి పోటీ చెయ్యడానికి కనీసం ముగ్గురు నలుగురు నాయకులు పోటీ పడుతునున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తామని, ఎన్ని పైరవీలు చేసినా సీట్లు ఇచ్చే ప్రసక్తిలేదని హైకమాండ్ పెద్దలు తేల్చి చెబుతున్నారు.
ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వంలోని జేడీఎస్ కు 10 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. మూడు సీట్లు మాత్రం ఎవ్వరికి కేటాయించాలి అనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. మిగిలిన సీట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోటీ చేయించాలని నిర్ణయించారు.
ముఖ్యంగా బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర, బెంగళూరు సెంట్రల్ నియోజ వర్గాల్లో పోటీ తీవ్రస్థాయిలో ఉంది. సోమవారం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ తో పాటు జేడీఎస్ పార్టీ సీట్ల పంపిణి విషయంలో సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications