వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎలెక్షన్ బొనాంజా: 35 ఏళ్లులోపు ఉన్నవారికి పన్ను మినహాయింపు..?

|
Google Oneindia TeluguNews

2019 ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగానే ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయింది కాంగ్రెస్. ఎన్డీఏ సర్కార్‌పై పైచేయి సాధించేందుకు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కాంగ్రెస్ వదలడం లేదు. ఇప్పటికే పలు తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొద్ది రోజులు క్రితం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కొన్ని తీర్మానాలను సైతం ప్రవేశపెట్టింది. తాజాగా మరో తాయిలం వెలుగు చూసింది.

2019లో అధికారంలోకి వస్తే 35 ఏళ్లులోపు వయస్సున్న వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం చాలా బలంగా వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వాగ్దానం సాధ్యసాధ్యాలపై కూడా స్టడీ చేస్తున్నట్లు సమాచారం. జూలై 13న జరిగిన పార్టీ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పటికీ... దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. మేనిఫెస్టోలో పెడతారా లేదా అనేదానిపై కూడా స్పష్టత రాలేదని సమాచారం.

 Congress idea: No income tax for all under 35 years of age,later clarifies

జూలై 13న జరిగిన పార్టీ సమావేశానికి ప్రియాంకాగాంధీ కూడా హాజరయ్యారని పార్టీ వ్యూహాలను ఆమె రచిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. 35 ఏళ్లలోపు వయస్సున్న వారికి పన్నుమినహాయింపు ఇవ్వడం యువతను కూడా ఆలోచింపజేస్తుందనే భావనలో హస్తం పార్టీ ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 15 మిలియన్ ఓటర్లు తొలిసారిగా ఓటు వినియోగించుకోబోతున్నారు.

అంతేకాదు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల యువత కొత్త ఐడియాలతో వచ్చి కొత్త పరిశ్రమలు స్థాపించే అవకాశముందని తద్వారా ఉపాధి కూడా కలుగుతుందనే యోచనలో కాంగ్రెస్ యోచిస్తోంది. అయితే ఇది మేనిఫెస్టోలో పెడితే మాత్రం కాంగ్రెస్‌కు పంట పండినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైతే మేనిఫెస్టోలో పెడతామనే మాట రాకున్నప్పటికీ రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా ఈ ఆలోచనపై చర్చించే అవకాశముందని విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ మీటింగ్‌లో ఈ ప్రతిపాదన వచ్చిందని అయితే.... 35 ఏళ్ల లోపు ఉన్న వారికి పన్నుమినహాయింపు అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు.

English summary
Just a few months away for the 2019 elections, congress is deliberating on whether to offer a major tax sop in its manifesto.According to sources the party is planning to put in its manifesto that the people below 35 years of age need not pay income tax. But congress spokes person Ranadeep Surjewala clarified that it was only a proposal made at the meeeting and have not taken a final decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X