కెసిఆర్ తిరస్కరించారు, టీలో కాంగ్రెసు ఒంటరి: జైట్లీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెసు ఏకాకి అయిందని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న యుపిఎ తమిళనాడులో సింగిల్ డిజిట్ ఓట్లకు పరిమితవుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసుతో స్నేహానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సిద్ధంగా లేదని ఆయన అన్నారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ పార్టీకి సానుకూలత వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెసుకు సమర్థవంతమైన నాయకత్వం లేదని, ఎజెండా లేదని, తగిన మిత్రులు లేరని, ఆ రకంగా కాంగ్రెసు ఎన్నికలకు వెళ్తోందని ఆయన అన్నారు.

గతంలో యుపిఎ మిత్రులుగా ఉన్నవాళ్లు ఒక్కరొక్కరే దూరమవుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసును మునుగుతున్న నావగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెసు నాయకులు పోటీ చేయడానికి కూడా వెనకాడుతున్నారని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
ఓపినీయన్ పోల్స్ జోక్స్ అని రాహుల్ గాంధీ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. తమకు గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని రాహుల్ గాంధీ నమ్మితే అది వాస్తవ విరుద్ధమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications