చేతులు కాల్చుకుంటోన్న కాంగ్రెస్: పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటే ఎలా?

Congress: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. అధికార పక్షాన్ని కార్నర్ చేయడానికి ప్రయోగిస్తోన్న అస్త్రాలేవీ లక్ష్యాన్ని చేరట్లేదు. తుస్సుమంటోన్నాయి. ఫలితంగా సొంత కూటమి ఇండియా బ్లాక్ పార్టీలు సైతం దూరం జరిగే పరిస్థితి ఎదురైంది.

దీనికి ప్రధాన కారణం- అదాని వివాదం. దేశంలో మరే ఇతర సమస్యలు లేవన్నట్లుగా ఒక్క అదాని చుట్టే తిరుగుతోంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేస్తోంది. సభా కార్యకలాపాలను అడ్డుకుంటోంది. వాయిదా తీర్మానాలనూ ఇస్తోంది. వాటిని లెక్క కూడా చేయట్లేదు ఎన్డీఏ.

Congress isolating it within the INDIA bloc on Adani issue in the Parliament

రోజుల తరబడి ఈ ఒక్క అంశం చుట్టే కాంగ్రెస్ తిరుగాడుతోండటం ఆ పార్టీ వ్యూహాలు ఎంత బలహీనంగా ఉన్నాయో స్పష్టమౌతోంది. ఉద్యోగాల కల్పన, ఆహార భద్రత, రోజురోజుకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు, మహిళలు- యువత ఎదుర్కొంటోన్న అనేక అంశాల గురించి సభలో ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ- వాటిని బుల్ డోజ్ చేస్తోంది. అదాని అంశాన్ని మాత్రమే పదే పదే ప్రస్తావిస్తోంది.

ఈ పరిణామాలు ఇండియా బ్లాక్‌ భాగస్వామ్య పక్షాలను కూడా అసహనానికి గురి చేస్తోన్నాయి. తన వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోన్నాయి. తాజాగా శరద్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

కాంగ్రెస్ పదేపదే అదాని అంశాన్ని ప్రస్తావిస్తోండటం పట్ల పార్టీ ఎంపీ అమోల్ కొల్హే ఘాటుగా స్పందించారు. రైతులు, యువత, మహిళలు ఎదుర్కొంటోన్న సమస్యలపై సభలో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. తన వైఖరిని ఎంత త్వరగా మార్చుకోగలిగితే అంత బాగుంటుందని వ్యాఖ్యానించారు.

ఇదివరకు తృణమూల్ కాంగ్రెస్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజా సంక్షేమం.. వంటి దేశం ఎదుర్కొంటోన్న ఇతర అంశాలపై ప్రతిపక్షాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తేల్చి చెప్పారు.

లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ నేతృత్వంలో నిర్వహించే నిరసనల్లో పాల్గొనట్లేదు. వాటికి దూరంగా ఉంటోంది. కాంగ్రెస్ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ జాబితాలో ఇప్పుడు ఎన్సీపీ (ఎస్పీ వర్గం) కూడా చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా బ్లాక్‌లో చీలికలు తప్పకపోవచ్చనే సంకేతాలను పంపించినట్టయింది.

అదానీ కేసు విషయంపై సాధారణ పౌరులకు పెద్దగా ఆసక్తి ఉండట్లేదనేది ఎన్సీపీ అభిప్రాయం. అది జనంలోకి చొచ్చుకు వెళ్లట్లేదని అంచనా వేస్తోంది. దీనికి బదులుగా దేశ ప్రజలు నిత్యం ఎదుర్కొంటోన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలపై పోరాటం చేయకపోవడం వల్ల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విలువైన అవకాశాలను కోల్పోతోన్నామని కొందరు కాంగ్రెస్ ఎంపీలు సైతం చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+