బీజేపీదే ఆధిక్యం కానీ, జేడీఎస్ కింగ్! కాంగ్రెస్‌కు 78: అదునుచూసి దెబ్బకొట్టిన అమిత్ షా
బెంగళూరు: ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కర్నాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఫలితాలు మొదలు ప్రభుత్వ ఏర్పాటు వరకు ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతోంది. కర్నాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఎక్కువ సర్వేలు చెప్పినట్లుగా హంగ్ వచ్చింది.

మేజిక్ ఫిగర్ 112
222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మేజిక్ ఫిగర్ 112. బీజేపీకి 112, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 38, ఇతరులకు రెండు స్థానాలు దక్కాయి. ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కక పోవడంతో అసలు గేమ్ అక్కడే మొదలైంది. బీజేపీకి కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే తక్కువపడ్డాయి. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారని బీజేపీ అంటోంది. మరోవైపు జేడీఎస్ - కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదిపాయి.

అనూహ్య మలుపు
జేడీఎస్ ఏ సమయంలోను బీజేపీతో చర్చలు జరపకుండా ఉండేందుకు కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ -జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించాయి. అదే సమయంలో బీజేపీ అధినేత అమిత్ షా పావులు కదిపారు. బీజేపీ నేత యెడ్యూరప్ప గవర్నర్‌ను కలిసి తనకు దేవేగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. దీంతో అనూహ్య మలుపు తిరిగింది.

అక్కడే బీజేపీకి అవకాశం చిక్కిందా?
రాజకీయపరంగా దేవేగౌడ కుటుంబంలో మూడు గ్రూపులు ఉన్నాయని అంటారు. దేవేగౌడ, రేవణ్ణ, కుమారస్వామి వర్గాలు. కుమారస్వామికి కాంగ్రెస్ సీఎం పదవి ఇస్తానని చెప్పడంతో బీజేపీ చక్రం తిప్పి రేవణ్ణను తమ వైపు తిప్పుకుందా అనేది తేలాల్సి ఉంది. యెడ్డీ మాత్రం రేవణ్ణతో పాటు 12 మంది తమ వెంట ఉన్నారని చెబుతున్నారు.

12 మంది బీజేపీ వైపు వెళ్లిపోతే
యెడ్యూరప్ప చెప్పినట్లుగా బీజేపీ వైపు 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే జేడీఎస్‌కు మిగిలేది 26 మందే. అప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ కలుపుకుంటే 104 అవుతుంది. అదే బీజేపీ బలం 116 అవుతుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఇందుకోసం రేవణ్ణ వర్గానికి మంత్రి పదవులుఎరగా వేసిందని తెలుస్తోంది. రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎరగా వేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు చీలికను అడ్డుకునేందుకు కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications