షాకింగ్: కుమారస్వామికి దొరకని గవర్నర్ అపాయింటుమెంట్? కాంగ్రెస్ ముందు 3 ప్లాన్‌లు

బెంగళూరు: జేడీఎస్ అధినేత కుమార స్వామి గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ చేరుకున్నారు. జేడీఎస్ శాసన సభా పక్షం ఆయనను జేడీఎస్ఎల్పీగా ఎన్నుకున్న అనంతరం సోదరుడు రేవణ్ణతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం రాజ్ భవన్ వచ్చారు.

తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్‌ను కోరనున్నారు. ఈ మేరకు తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల జాబితాను ఆయనకు సమర్పించనున్నారు. అయితే కుమారస్వామికి గవర్నర్ అపాయింటుమెంట్ దొరకలేదని తెలుస్తోంది.

Congress, JD(S) leaders to meet Karnataka governor for government formation

అంతకుముందు బీజేపీఎల్పీ యడ్యూరప్ప గవర్నర్‌ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. ఓ వైపు బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటోందని ఆరోపిస్తున్న జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలు.. బీజేపీ ఎమ్మెల్యేలపై కన్నేశాయి. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపుకు రావాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ - జేడీఎస్‌ల ముందు మూడు వ్యూహాలు

గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ముందు మూడు వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. 1. జేడీఎస్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ వద్ద పరేడ్ నిర్వహించడం. 2. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లడం. 3. జేడీఎస్-కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహించడం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+