పీ చిదంబరంపై చేయి చేసుకున్న పోలీసులు: తోసివేత: పక్కటెముకలు విరిగి..
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొంటోన్నారు. తొలిరోజు 10 గంటల పాటు ఆయనను ఈడీ అధికారులు విచారించారు. ఇవ్వాళ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు
దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రులు, పీసీసీ అధ్యక్షులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. సత్యాగ్రహ మార్చ్ చేపట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం రోడ్డెక్కారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రు భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా- దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఆందోళన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహాన్ని చూపారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. తమపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తోన్నారు. అరెస్ట్ చేసే సమయంలో తమను కొట్టారంటూ ధ్వజమెత్తుతున్నారు.
ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం గాయపడ్డారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. ఎడమవైపు పక్కటెముకలు ఫ్రాక్చర్ అయ్యాయని చెప్పారు. పక్కటెముకల నొప్పితో ఆయన బాధపడుతున్నారని, 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించినట్లు వివరించారు.
చిదంబరంతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, ఎంపీ ప్రమోద్ తివారీ సహా పలువురు నాయకులు గాయపడ్డారని రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా చెప్పారు. శాంతియుతంగా సత్యాగ్రహ మార్చ్‌ను నిర్వహిస్తోన్న తమపై మోడీ ప్రభుత్వం దమనకాండను సాగించిందని, పోలీసులను ప్రయోగించిందని అన్నారు.
కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సరోజినీ నగర్, తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. 10 గంటల పాటు వారంతా పోలీసుల నిర్బంధంలో ఉంచారు. సుర్జేవాలాతో పాటు కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, శక్తిసిన్హ్ గోహిల్, అనిల్ చౌధురి సహా పలువురు నాయకులు అర్ధరాత్రి వరకు పోలీసుల అదుపులో ఉన్నారు.












Click it and Unblock the Notifications