
సచిన్ పైలట్‌కు కరోనా పాజిటివ్ -కోలుకోవాలని గెహ్లాట్ ఆకాంక్ష - రాజస్థాన్‌లో 2.19లక్షల కేసులు
రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గురువారం ట్విట్టర్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో టెస్టులు చేయించుకోగా, కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, డాక్టర్ల సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బీహార్:
భారీ
షాకిచ్చిన
నితీశ్
కుమార్
-
సీఎం
పదవి
కోరలేదు
-అది
బీజేపీ
ఇష్టం
-ప్రమాణం
తేదీ
తెలీదు
ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని సచిన్ పైలట్ సూచించారు. విభేదాలు సమసిపోయిన వేళ, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. సచిన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పైలట్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సీఎం గురువారం ఓ ట్వీట్ చేశారు. కాగా,

రాజస్థాన్ ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటన మేరకు.. కొత్తగా 2,176 కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2.19 లక్షలు, మరణాల సంఖ్య 2032కు చేరింది. గత 24 గంటల్లో 22,900 శాంపిళ్లను టెస్టు చేశారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 39.7లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు. ఇక..
షాకింగ్:
ట్రంప్
ఆరోపణలు
నిజమే
-ఆధారాలతో
విజిల్
బ్లోయర్లు
-డొమినియన్
ఓటింగ్
సిస్టమ్
అక్రమాలంటూ
దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్తగా 47,905 కేసులు, 550 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,83,917కు, మరణాల సంఖ్య 1,28,121కు పెరిగింది.