ఓటమిని తట్టుకోలేక సొంత పార్టీపైనే... ఖుష్బూ, శర్మిష్ట కామెంట్లు వైరల్..
చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. 1951 నుంచి 2020 దాకా ఢిల్లీ అసెంబ్లీకి మొత్తం ఏడు సార్లు ఎన్నికలు జరగగా, అందరికంటే ఎక్కువగా నాలుగు సార్లు విజయం సాధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఆ పార్టీ ఫర్వాలేదనిపించే స్థాయిలో ఓట్లు రాబట్టుకోగలిగింది. కానీ మంగళవారం నాటి అసెంబ్లీ ఫలితాల్లో మాత్రం చావుదెబ్బ తినింది. పుండుమీద కారం చల్లినట్లు.. ఓటమి భారంతో కుంగిపోయిన కాంగ్రెస్ పై సొంత పార్టీనేతలే విరుచుకుపడుతున్నారు.

అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతు..
ఢిల్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తుకుని ఆ పార్టీకి నాలుగు సీట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ.. సొంతగా 66 స్థానాల్లో పోటీ చేసింది. అందులో ఒక్కటంటే ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోకపోయిన కాంగ్రెస్.. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోవడం గమనార్హం. పోటీ ఇస్తారనుకున్న ఆల్కా లాంబా లాంటి క్యాండిడేట్లు కూడా ధారావత్తు కోల్పోవడం పార్టీకి మింగుడుపడని అంశంగా మారింది.

ఇప్పటికైనా మేల్కొందాం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని ఆశించనప్పటికీ.. ఇంత దారుణంగా ఓడిపోతామని మాత్రం కలలో కూడా అనేకోలేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, నటి ఖుష్బూ సుందర్ వాపోయారు. అసలు పార్టీ పనిచేస్తుందా? లేదా? సరైన దారిలో వెళుతున్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. కనీసం ఇప్పటికైనా మేల్కొని, పరిస్థితుల్ని చక్కబెట్టుకుందామంటూ ఖుష్బూ సూచించారు.

కాంగ్రెస్ సర్వ నాశనం..
ఢిల్లీలో కాంగ్రెస్ ఘోరపరాజయంలో తన వంతు పాత్ర కూడా ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సర్వనాశమైపోయిందని, కార్యకర్తల్ని సరైన దిశలో నడిపించే నాయకత్వం కొరవడిందని, వ్యూహం, సమన్వయం అసలే లేకుండాపోయాయని ఆమె చెప్పారు. పైస్థాయిలో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం.. పార్టీ ఓటమికిగల కారణాల్లో ప్రధానమైందని, ఇక ఆత్మశోధన చేసుకునే సమయం ఆసన్నమైందని శర్మిష్ట అన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications