మాతో టచ్‌లోనే,ఆనంద్ సింగ్ ఓటు మాకే: కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి
బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తమకే ఓటు చేస్తారని కర్ణాటక మాజీ హోంశాఖ మంత్రి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జెడి(ఎస్) క్యాంప్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ లేరు. అయితే ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ను బిజెపి నేతలు బెదిరింపులకు పాల్పుడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మే 19వ తేది సాయంత్రం 4 గంటలకు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగనుంది. ఈ విశ్వాస పరీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆనంద్ సింగ్ తప్పకుండా హజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి అభిప్రాయపడ్డారు.

తమతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ లేకపోయినా తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆనంద్ సింగ్ సంప్రదింపులు జరుపుతున్నారని రామలింగారెడ్డి చెప్పారు. తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను ఈడీతో పాటు ఇతరత్రా సంస్థలను బూచీగా చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, జెడి(ఎస్)చ నేతలు బిజెపి పై ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ క్యాంప్ కు రాకుండా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అదృశ్యమయ్యారు. ఈ తరుణంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను హైద్రాబాద్ కు తరలించాయి.
అయితే మే 19వ తేదిన బలనిరూపణ ఉన్నందున ఆనంద్ సింగ్ విశ్వాస పరీక్షకు హజరౌతారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఆనంద్ సింగ్ విశ్వాసపరీక్షకు హజరుకానున్నారని రామలింగారెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications