కర్ణాటకలో కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యల దుమారం.. రాతంత్రా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

ఢిల్లీలోని ఎర్రకోటపై ఏదో ఒక రోజు కాషాయ జెండా ఎగురుతుందంటూ కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేగింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేఎస్ ను మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని పట్టుబట్టారు. ఈనేపథ్యంలోనే గురువారం రాత్రి అనూహ్యంగా అసెంబ్లీలో నిరసనకు దిగారు. రాత్రంతా అసెంబ్లీలోనే నిరసన చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చారు.

అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసన.. బొమ్మై, యడియూరప్ప బుజ్జగింపు
మంత్రి కేఎస్ ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తప్పించే వరకు అసెంబ్లీలో నిరసన కొనసాగుతుందని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప రంగంలోకి దిగారు. నిరసన విరమించాలంటూ కాంగ్రెస్ నేతలను కలిసి విజ్ణప్తి చేశారు.

congress mlas over night protest in karnataka assembly

కేఎస్ ఈశ్వరప్పను తొలగించాల్సిందే
అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన విరమించేందుకు ససేమిరా అన్నారు. మంత్రిపై దేశద్రోహం కేసు నమోదు చేసి, ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. వారితో చర్చల అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మె, మాజీ సీఎం బీఎస్‌ యెడియూరప్ప వెనుదిరిగారు. శుక్రవారం మరొసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడతామని .. నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నామని యడియూరప్ప తెలిపారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనపై మంత్రి కేఈ ఈశ్వరప్ప స్పందించారు. నిరసన చేస్తే చేసుకోనివ్వండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+