విధాన సౌధలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు?, విచారణకు సీఎం ఆదేశాలు, సీసీటీవీల్లో?
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా బెంగళూరులోని విధానసౌధలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ముందుగా ఈ వివాదంపై విచారణ జరిపించాలని అన్నారు.
మేము ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎల్‌కు విచారణ కోసం శిఫారస్సు చేశామని, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య అన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అని నిదాలు ఎవరు చేసినా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, దేశద్రోహులను, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారిని వదిలిపెట్టమని సీఎం సిద్దరామయ్య చెప్పారు.

పాకిస్థాన్ కు అనుకూల నినాదాలు చేయడాన్ని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ కూడా ఖండించారు, మంగళవారం బెంగళూరులోని విధాన సౌధలో రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ సంఘటన మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అది నిజమైతే నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని, పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన వారు ఎవరైనా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తాను కూడా డిమాండ్ చేస్తున్నానని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ అన్నారు.
ఇది నా పరిధిలో జరిగిన సంఘటన, దీనిపై తగిన విచారణ జరిపి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తాను సీఎం సిద్దరామయ్యకు, హోం మంత్రి పరమేశ్వర్ కు తెలియజేస్తానని స్పీకర్ యూటీ ఖాదర్ చెప్పారు. ఈ ఘటనపై ఒకరినొకరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. ఆ క్లిప్పింగ్‌ని భద్రపరచడం. అధికారికంగా టెలికాస్ట్ చేస్తే క్లిప్పింగ్‌ను తీసుకుని దర్యాప్తు చేస్తామని హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.

ఇప్పటికే సుమోటో కేసు నమోదు చేశామని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు. దానికి తోడు బీజేపీ ఇచ్చిన ఫిర్యాదును జోడించామని, మొదటి టెలికాస్ట్ చేసిన వారి వీడియోను మేము తీసుకుని విచారణ జరిపిస్తామని, దానిపై దర్యాప్తు చేస్తామని, ఆ వీడియో క్లిప్పింగ్ ఎఫ్ఎస్ఎల్ కు పంపించే ప్రక్రియలు ప్రారంభమయ్యాయని, తప్పు చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.
మనది తప్పు అని చెప్పకుండా వాళ్ళ పని వాళ్లను చేయనివ్వండి, అలాగే పోలీసులు విధాన సౌధలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలన్నీ సేకరించి దర్యాప్తు చేస్తున్నారని హోం మంత్రి పరమేశ్వర్ అన్నారు. కొందరు నాసిర్ సాబ్ జిందాబాద్ అని, కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అని అంటున్నారని, ఇందులోని నిజానిజాలను శాస్త్రీయంగా తెలుసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిస్తున్నామని, పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేసి ఉంటే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ అన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications