బెంగళూరు బ్రాండ్ ను నాశనం చేస్తున్న మోదీ, అమిత్ షా, యోగి, అందుకే ప్లాన్, డీకే బ్రదర్ !
లోక్‌సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ నేతలు ఒక్కటయ్యారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ నేతలు ఢీకొట్టాలని ప్లాన్ చేయడంతో డీకే బ్రదర్స్ కు కంచుకోటగా ఉన్న బెంగళూరు రూరల్ నియోజకవర్గాన్ని బీజేపీ హైకమాండ్ నేతలు టార్గెట్ చేశారు.
బెంగళూరు గ్రామీణ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేసేందుకు బీజేపీ జాతీయ నాయకులు రంగం సిద్ధం చేశారు. ఈ విషయమై బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ డీకే సురేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ జాతీయ నేతలు బెంగళూరు నగరంతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వస్తున్నారని వ్యంగంగా అన్నారు.

బెంగళూరు బ్రాండ్ ను, బెంగుళూరు ప్రతిష్టను చెడగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఆరోపించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారని, కర్ణాటకకు కాదని వారి రాష్ట్రాలు బాగుపడేందుకు ఇది దోహదపడుతుందని మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తున్నారని డీకే సురేష్ ఆరోపించారు. తాగు నీటి సమస్యతో సహా కర్ణాటక సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించలేదని డీకే సురేష్ ఆరోపించారు.

నిజానికి యోగి ఆదిత్యనాథ్ మన డబ్బు అంటే కర్ణాటక డబ్బులు తీసుకుని వెళ్లి ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారని, ఒకప్పుడు బెంగళూరుకు కంపెనీలు వచ్చేవని, ఇప్పుడు ఆ కంపెనీలను అహ్మదాబాద్ తీసుకెళ్తున్నారని, బెంగళూరుకు చెడ్డపేరు తీసుకురావడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, బెంగళూరు బ్రాండ్ చెడకొట్టడానికి బీజేపీ స్కెచ్ వేసిందని డీకే సురేష్ ఆరోపించారు.రామమందిరం నిర్మాణం ఇప్పుడు మీ గెలుపుకు ఇబ్బంది అవుతుందని మీరు భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా కర్ణాటకలో చాలా ఆలయాలు ఉన్నాయని, ఇక్కడ దేవుళ్లకు, ఆలయాలకు కొరత లేదని డీకే సురేష్ అన్నారు.
కర్ణాటకలో రాముడిని మాత్రమే పూజించే వారు చాలా తక్కువ మంది ఉన్నారని, అందులో తాను ఓక్కడు అని, నేను నా ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తున్నానని, కానీ నేను దాని గురించి ఎటువంటి ప్రచారం చెయ్యడం లేదని, ఈ ఎన్నికల్లో రాముడిని బీజేపీ వాడుకుంటోందని డీకే సురేష్ ఆరోపించారు. తనను ఓడించడానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చి తనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చెయ్యడానికి సిద్దం అయ్యారని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక డీసీఎం సోదరుడు డీకే సురేష్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications