సీఎంపీపై కాంగ్రెస్-ఎన్సీపీ నేతల చర్చ, బ్లూ ప్రింట్ రెడీ చేసిన జైరాం రమేశ్..
చర్చోపచర్చల తర్వాత మహారాష్ట్రలో పొత్తు పొడవనుంది. శివసేనతో కలిసి కూటమి ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్-ఎన్సీపీ స్పష్టంచేశాయి. దీంతో ఢిల్లీలో ఎన్సీపీ శరద్ పవార్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కనీస ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జైరాం రమేశ్, అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గే, పృథ్వీరాజ్ చౌహాన్, కేసీ వేణుగోపాల్, ఎన్ీసపీ నుంచి సుప్రియ సూలే, అజిత్ పవార్, జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ సీఎంపీ..?
కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించే బాధ్యతను జైరాం రమేశ్‌కు అప్పగించినట్టు ప్రచారం జరుగుతుంది. సమావేశంలో కీలక నిర్ణయాలపై తుదిరూపం వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు కాంగ్రెస్-ఎన్సీపీ ఇచ్చిన ప్రధాన హామీల అమలు లక్ష్యంగా ఆయా పార్టీలు కలిసి పనిచేస్తాయి. పంట రుణమాపీ, పంట పెట్టుబడి పథకం తదితర అంశాలపై డిస్కష్ చేస్తారు.

సోనియా గ్రీన్ సిగ్నల్
అంతకుముందు శివసేనతో కలిసి కూటమి ఏర్పాటు చేయడానికి సోనియాగాంధీ ఆమోదం తెలిపారని ఎన్సీపీ వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశారు. సోమవారం సోనియాగాంధీతో శరద్ పవార్ సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై తొందరపడకుండా చర్చలు సంయమనంతో జరుగుతున్నాయని ఎన్సీపీ వర్గాలు తెలియజేశాయి.
ఫస్ట్ వీక్‌లో..
డిసెంబర్ మొదటివారంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సీఎం పదవీ, డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులపై మాత్రం కాంగ్రెస్, ఎన్సీపీ స్ఫష్టతనివ్వలేదు. మంత్రి పదవులు మాత్రం సమానంగా పంచుకుంటామని ఆ పార్టీలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

రానీ మెజారిటీ
గత నెలలో మహారాష్ట్రలో ఎన్నికలు ముగిసాక, ఫలితాలను కూడా ప్రకటించారు. అయితే ఏ పార్టీ పూర్తి మద్దతు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. బీజేపీ 105 సీట్ల మధ్య ఆగిపోవడం, శివసేన 50-50 ఫార్ములాను తెరపైకి తీసుకురావడంతో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై పీటముడి నెలకొంది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కూడా విధించిన సంగతి తెలిసిందే.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications