బీజేపీతో ఆడుకుంటున్న ప్రతిపక్షాలు, ఆరు కారణాలతో ఆలస్యం ?, పడవ గల్లంతు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ లు ఆడుకుంటున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటించినా ఇంత వరకు అధికార పార్టీ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చెయ్యకపోవడంతో బీజేపీ నాయకులను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఆరు ప్రధాన కారణాలతో బీజేపీ నాయకులు ఇంత వరకు అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చెయ్యలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమీషన్ మే 10వ తేదీ డేట్ ఫిక్స్ చేసింది. కాంగ్రెస్ ఇప్పటికే మొదటి జాబితాలో 124 మంది, రెండో జాబితాలో 42 మంది పేర్లు విడుదల చేసింది, జేడీఎస్ కూడా మొదటి జాబితా విడుదల చేసింది. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మొదటి జాబితా కాదు కదా ఒక్క అభ్యర్థి పేరు కూడా ప్రకటించలేదు.

ఓటమి ముందుగానే ఊహించిన బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా కాలం గడిపేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కచ్చితంగా అధికారానికి దూరం అవుతామని బీజేపీ నాయకులకు తెలుసని, అందుకే డ్రామాలు ఆడుతున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్వీట్ చేశారు.
బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చెయ్యకపోవడానికి ఆరు కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. యడియూరప్ప వర్గం, బసవరాజ్ బోమ్మయ్ వర్గం, బీజేపీ హైకమాండ్ వర్గం, బీఎల్, సంతోష్ వర్గం, ఆర్ఎస్ఎస్ వర్గం, వలసలు వెళ్లిన వారి వర్గం ఇలా ఆరు వర్గాల కారణంగా బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చెయ్యడంలో ఆలస్యం అవుతోందని, కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేకపోవడంతో ఇంత మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications