మహిళా కార్పొరేటర్ మీద అక్కడ చెయ్యి వేశాడు, చెప్పుతో, చెయ్యి విరిచి, ఎమ్మెల్యే ఇల్లు!

Posted By:
Subscribe to Oneindia Telugu

మంగళూరు/బెంగళూరు: శాసన సభ్యుడి ఇంటిలో మహిళా కార్పొరేటర్ మీద వెయ్యరాని చోట చెయ్యి వేసి వెకిలి చేష్టలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చితకబాదేశారు. ఎక్కడపడితే అక్కడ చెయ్యి వేసినందుకు మహిళ కార్పొరేటర్ కు మండిపోయింది. అంతే కామాంధుడిని వెంటాడి వెంటాడి చెప్పుతో దాడి చేసింది. ఆమె మద్దతుదారులు దాడి చెయ్యడంతో కామాంధుడైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెయ్యి విరిగి, తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఎమ్మెల్యే ఇల్లు

ఎమ్మెల్యే ఇల్లు

మంగళూరు ఉత్తర నియోజ వర్గం ఎమ్మెల్యే మోయిద్దీన్ బాబా ఇంటి ఆవరణంలో ఉన్న కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఎత్తులకు మనం ఎలా పై ఎత్తులు వెయ్యాలని అక్కడ చర్చ జరిగింది.

మహిళా కార్పొరేటర్

మహిళా కార్పొరేటర్

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా అబ్దుల్ సత్తార్ పని చేస్తున్నాడు. మంగళూరు నగరంలోని ఓ వార్డుకు కార్పొరేటర్ గా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిభా కుళాయ్ ఎమ్మెల్యే ఇంటిలో జరుగుతున్న సమావేశానికి హాజరైనారు.

ఎక్కడ చెయ్యవేశాడో!

ఎక్కడ చెయ్యవేశాడో!

మహిళా కార్పొరేటర్ ప్రతిభా కుళాయ్ ఒంటరిగా వస్తున్న సమయంలో ఓ గదిలో అబ్దుల్ సత్తార్ వెయ్యకూడని చోట ఆమె మీద చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే ఓపిక నసించిన ప్రతిభా కుళాయ్ మొదట చేతికి, తరువాత చెప్పుకు పని చెప్పారు.

పరుగు తీసిన లీడర్

పరుగు తీసిన లీడర్

ప్రతిభా కుళాయ్ ఒక్కసారిగా ఎదురుతిరిగి చెప్పుతో దాడి చెయ్యడంతో అబ్దుల్ సత్తార్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిభా కుళాయ్ వెంటాడి వెంటాడి అతని మీద దాడి చేశారు. విషయం గుర్తించిన ప్రతిభా కుళాయ్ మద్దతుదారులు దాడి చెయ్యడంతో అబ్దుల్ సత్తార్ చెయ్యి విరిగిపోయింది.

ఎమ్మెల్యే మౌనం

ఎమ్మెల్యే మౌనం

ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మోయిద్దీన్ బాబా మౌనంగా ఉన్నారు. తమకు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని, అబ్దుల్ సత్తార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అంటున్నారు. గతంలో అబ్దుల్ సత్తార్ మీద లైంగిక వేధిపుల ఆరోపణలు వచ్చినా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రస్తుతం తగిన శాస్తి జరిగిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dakshina kannada district congress secretory Abdul Sattar beaten by lady corporator Prathibha Kulai for miss behaving. incident happen in MLA Moyiddin Bhava's house.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి