వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జుమాటో డెలివరీ గర్ల్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్, గెలిస్తే కార్పొరేటర్, రోడ్డు గుంతలో పడితే!

|
Google Oneindia TeluguNews

మంగళూరు/బెంగళూరు: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జుమాటోలో డెలివరీ గర్ల్ గా పని చేస్తున్న సామాన్య యువతి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం చిక్కింది. కర్ణాటకలోని మంగళూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిస్తే కార్పొరేటర్ గా పని చేసే అవకాశం డెలివరీ గర్ల్ కు దక్కనుంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఆఫర్ ను తాను తిరస్కరించడానికి తన మనసు అంగీకరించలేదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని జుమాటో డెలివరీ గర్ల్ మేఘనా అంటోంది.

పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో?!పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో?!

టిక్కెట్ కావాలంటే డబ్బులు?

టిక్కెట్ కావాలంటే డబ్బులు?

లోక్ సభ, శాసన సభ ఎన్నికలతో పాటు మేయర్, కార్పొరేషన్, మునిసిపాలిటీ, జిల్లా పంచాయితీ, గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే రాజకీయ పార్టీల నేతలకు డబ్బులు ఇవ్వాలని ప్రజల నమ్మకం. అయితే మంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చెయ్యడానికి జుమాటో డెలివరీ గర్ల్ మేఘనాకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అదృష్టం తలుపు తట్టింది.

ఉదయం లేస్తే ఫుడ్ డెలివరీ

ఉదయం లేస్తే ఫుడ్ డెలివరీ

జుమాటో సంస్థ మంగళూరు సిటీ బ్రాంచ్ లో మేఘనా ఫుడ్ డెలివరీ గర్ల్ గా ఉద్యోగం చేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకూ మంగళూరు నగరంలోని వీదివీది తిరుగుతూ కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చెయ్యడమే మేఘనా దినచర్య. సాధారణ యువతిగా సాటి ఉద్యోగులతో కలిసి మేఘనా జుమాటో సంస్థలో ఉద్యోగం చేస్తూ జీవితం సాగిస్తోంది.

అదృష్టం తలుపు తట్టింది

అదృష్టం తలుపు తట్టింది

మంగళూరు నగరంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అదృష్టం మేఘనాను వెతుక్కుంటూ వెళ్లి తలుపు తట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా మేఘనాకు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ అవకాశం ఇచ్చారు. మేఘనాకు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేసుకోవాలని ఆమెకు సూచించారు.

రోడ్డు గుంతలో పడి ఆసుపత్రికి!

రోడ్డు గుంతలో పడి ఆసుపత్రికి!

బెంగళూరు నగరంలో రోడ్ల మీద గుంతలు ఎలా ఉంటాయో అదే విదంగా మంగళూరు నగరంలో రోడ్ల మీద గుంతలు దర్శనం ఇస్తాయి. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి స్కూటర్ లో వెలుతున్న సమయంలో మేఘనా రోడ్డు గుంతలో పడి ఆసుపత్రి పాలైయ్యింది. రోడ్ల గుంతలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొంది కొలుకున్న మేఘనాకు ఇప్పుడు అదే నగరంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మంగళూరు ప్రజలు ఆదరిస్తారా ? అనే విషయం వేచి చూడాలి.

కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్

కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ గర్ల్ గా ఉద్యోగం చేస్తున్న మేఘనాకు కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తే మేఘనా కార్పొరేటర్ అవుతోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్ ఇచ్చింది. ఈ ఆఫర్ కాదనడానికి తన మనసు అంగీకరించలేదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననమేఘనా చెబుతోంది.

వార్డు నెంబర్ 28, సమస్యలు 100

వార్డు నెంబర్ 28, సమస్యలు 100

మంగళూరు నగరంలోని వార్డు నెంబర్ 28 నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో మేఘనా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే ఈ వార్డులో సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ విషయంపై మేఘనా మాట్లాడుతూ తాను పోటీ చేస్తున్న వార్డులో 100కు పైగా సమస్యలు ఉన్నాయని, ఎన్నికల్లో గెలిస్తే ప్రజల సమస్యలు పరిష్కరించి వారి కష్టాలు తీర్చడానికి తాను ప్రయత్నిస్తానని మేఘనా అంటోంది. మొత్తం మీద ఈ రోజు ఇంటింటికి తిరిగి ఫుడ్ డెలివరీ చేస్తున్న మేఘనా ఇప్పుడు అదే విధంగా ఇంటింటికి తిరిగి తనకు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది.

English summary
Karnataka: Congress Made A New Record. The National Party Give a Mangaluru Corporation Election Ticket For Zomato Delivery Girl Meghana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X