BJP కంచుకోటలో కాంగ్రెస్ ఘనవిజయం
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. భారతీయ జనతాపార్టీకి కంచుకోటగా ఉండే మున్సిపాలిటీలో హస్తం పార్టీ తమ జెండాను రెపరెపలాడించింది. ఈ పరిణామం దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. బీజేపీకి ఏక్ నాథ్ షిండే వర్గం మద్దతిచ్చింది. వీటికి సంబంధించి ఎక్కువ స్థానాలు తాము సాధించామంటే తాము సాధించామని బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలకు దిగాయి.
ఈ ఎన్నికల్లో బీజేపీకి కీలక ప్రాంతంలో గట్టి దెబ్బ తగిలింది. ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉండే నాగపూర్ పంచాయితీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 200 చోట్ల విజయం సాధించింది. మొత్తం 236 పంచాయితీలున్నాయి. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ సొంత గ్రామం ఫెట్రీలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీలే ఫెట్రీలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనూహ్యంగా ఎదురుదెబ్బ తగలడంతో బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది.

బీజేపీతోపాటు శివసేన రెండు వర్గాలకు ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారంటున్నారు. కాంగ్రెస్ విజయాన్ని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రవల్లే సాధ్యమైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు ప్రజలు విసిగిపోయివున్నారని, కాంగ్రెస్ పార్టీని మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారనేది ఈ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. దీన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తున్నదనేది చూడాలి.












Click it and Unblock the Notifications