పంజాబ్ సీఎం అభ్యర్ధిగా చన్నీవైపే కాంగ్రెస్ మొగ్గు-ఇద్దరు సీఎంల ప్రతిపాదనకు నో చెప్పే ఛాన్స్

పంజాబ్ లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ ఒక్కరినే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇద్దరు సీఎంలను కాంగ్రెస్ ప్రకటించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఒక్కరినే సీఎంగా ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

పంజాబ్ లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్ధి పేరును యువ నేత రాహుల్ గాంధీ రేపు అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే ఈ పదవికి ప్రస్తుత సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీనే ప్రకటిస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు నిరాశ తప్పేలా లేదు. దీన్ని ముందే ఊహించి చన్నీపై సిద్ధూ విమర్శలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బలహీన ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలా వద్దా అనేది అధిష్టానం తేల్చుకోవాలని ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో సిద్దూ వైఖరి విమర్శల పాలవుతోంది.

congress party may not announce two chief ministers in rotation in punjab

గతంలోనూ సీఎం పీఠంపై ఆశతో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి తప్పించే వరకూ పోరాడిన సిద్ధూకు అప్పట్లో హైకమాండ్ చన్నీ ఎంపికతో భారీ షాకిచ్చింది. ఇప్పుడు కూడా దళిత సిక్కు వర్గానికి చెందిన చన్నీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని కాంగ్రెస్ యోచిస్తోంది.

దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిద్ధూ... రాహుల్ గాంధీ రేపు చన్నీ పేరును ప్రకటిస్తే ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొదట్లో వీరిద్దరి మధ్య సయోధ్యలో భాగంగా ఇద్దరికీ తలో రెండున్నరేళ్లు సీఎం అభ్యర్ధులుగా రాహుల్ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే దీన్ని పార్టీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+