వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ?? వెంటాడుతున్న యూపీ వైఫల్యం!!

|
Google Oneindia TeluguNews

శతాధిక చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు? అనే విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఆ పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ ముందుకు వస్తున్న దాఖలాలు కనపడటంలేదు. ఆయన్ను ఒప్పించేందుకు హస్తం పార్టీ నేతలు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వయోభారం దృష్ట్యా పదవిని చేపట్టేందుకు సోనియాగాంధీ కూడా విముఖంగానే ఉండటంతో తదుపరి అధ్యక్షుడెవరనేది ప్రశ్నార్థకంగా మారింది.

 ఓటు వేసేవారి జాబితా సిద్ధం

ఓటు వేసేవారి జాబితా సిద్ధం

ఈనెల 21వ తేదీ నుంచి సెప్టెంబరు 20వ తేదీ వరకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుంది. ఓటు వేసేవారి జాబితాను కూడా సిద్ధం చేశారు. త్వరలోనే ఎన్నికల తేదీని ప్రకటించబోతున్నారు. అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని రాహుల్ చెప్పారు.. కానీ ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పినట్లు ఇప్పటికే జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

 గాంధీ కుటుంబమే పగ్గాలు చేపట్టాలి

గాంధీ కుటుంబమే పగ్గాలు చేపట్టాలి


అధ్యక్ష పదవికి ప్రియాంక గాంధీ పేరు తెరపైకి వస్తోంది. గాంధీ కుటుంబమే పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని కాంగ్రెస్ లోని అత్యధిక నేతలు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ ఒప్పుకోకపోతే ప్రియాంక పేరును ప్రతిపాదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక వైఫల్యం దృష్ట్యా ఆమెకు పగ్గాలు అప్పగించే అవకాశాలు లేకపోవచ్చని తెలుస్తోంది. పార్టీ తదుపరి అధ్యక్షులెవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతోంది.

సెప్టెంబరు నుంచి భారత్ జోడోయాత్ర

సెప్టెంబరు నుంచి భారత్ జోడోయాత్ర


లోక్ సభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి కూడా ఓటమిపాలవడంతో 2019లో రాహుల్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆ బాధ్యతలను సోనియా చేపట్టారు. మధ్యలో సీనియర్ నేతలు అసమ్మతి గళం వినిపించినప్పుడు రాజీనామా చేసేందుకు ఆమె సిద్ధపడినా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విన్నపం మేరకు ఆమె కొనసాగుతున్నారు. మరోసారి అధ్యక్ష పదవిపై ఆసక్తి లేనప్పటికీ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ పోరును రాహుల్ గాంధీ ముందుండి నడిపిస్తున్నారు. సెప్టెంబరులో ఆయన కన్యాకుమారి నుంచి 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం ఈ యాత్రపైనే ఉంది.

English summary
Who is the National President of the Congress party which has a hundred years of history? Ambiguity still persists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X