ఆయుర్వేద ఆసుపత్రిలో యువరాజు, ఏం జరిగింది ?, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారంటే !
తిరువనంతపురం/కేరళ: భారత్ జోడో యాత్ర'లో మోకాలి సంబంధిత సమస్యతో బాధపడుతూ కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం డిశ్చార్జ్ అవుతారని పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. మోకాళ్ల సంబంధిత సమస్య కారణంగా రాహుల్ గాంధీ జూలై 21న కేరళలోని కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో చేరారు.
రాహుల్ గాంధీ ఆదివారం డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని కోజికోడ్‌లోని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. మోకాలు నొప్పి కారణంగా రాహుల్ గాంధీ కేరళలోని మల్లప్పురంలోని ఆయుర్వేద ఆసుపత్రిలో చేశారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ఆయుర్వదే ఆసుపత్రి ట్రస్టీ డాక్టర్. పీకే. వారియర్ సూచనల మేరకు రాహుల్ గాంధీకి చికిత్స అందిస్తున్నారు.

గత ఏడాదిలో రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుమారు 4 వేల కిలోమీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. రాహుల్ గాంధీకి పాదయాత్ర చేస్తున్న సమయంలోనే మోకాలి నొప్పి వచ్చిందని, అయితే పాదయాత్ర పూర్తి అయ్యే వరకు ఆ మ్యాటర్ ఆయన బయటపెట్టలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు.
రాహుల్ గాంధీ అనారోగ్యంతో ఉండటం వలనే కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చెయ్యడంలో ఆలస్యం అవుతోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చర్చించకుండా పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అంటున్నారని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు. ఇదే నెల 30వ తేదీన రాహుల్ గాంధీ ఆయుర్వేద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications