ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోనూ బీజేపీ ఓడిపోతుంది; ఆ విషయంలో మోడీకి పృధ్వీరాజ్ చవాన్ సవాల్
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో బీజేపీ తీరుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిజెపికి ప్రజల వద్దకు వెళ్లి చేసిన అభివృద్ధిని చెప్పుకోవడానికి ముఖం లేదని మండిపడుతున్నాయి. ఎందుకంటే బీజేపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, అందుకే బీజేపీ టెర్రరిజం వంటి వ్యాఖ్యలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సోమవారం భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విరుచుకుపడ్డారు.

ఐదు రాష్ట్రాలలోనూ బీజేపీ మెజార్టీ కోల్పోతుంది : పృధ్వీరాజ్ చవాన్
భారతీయ జనతా పార్టీకి మాట్లాడడానికి ఏ అంశము లేదని, బీజేపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, బిజెపి పాలిత రాష్ట్రాలలో సమస్యలన్నీ అలాగే ఉన్నాయని ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ బిజెపి మెజారిటీ కోల్పోతుందని పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించిన చైనా సమస్యపై మాట్లాడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.

ఈసారి ఎన్నికల్లో బీజేపీకి మాట్లాడటానికి ఏ అంశం దొరకటం లేదు
=చవాన్ మాట్లాడుతూ, "ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ రాదని పేర్కొన్నారు. ఎందుకంటే గతసారి, రామమందిరం అంశంపై ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు దానిని నిర్మిస్తారు కాబట్టి అది ఇప్పుడు సమస్య కాదు. కాబట్టి బీజేపీ మాట్లాడటానికి ఎలాంటి అంశం లేదని పేర్కొన్నారు. ఇటీవల, ఉగ్రవాద సానుభూతిపరులతో రెండు పార్టీలకు సంబంధాలు ఉన్నాయని మాపై, సమాజ్‌వాదీ పార్టీపై కూడా ప్రధాని ఆరోపణలు చేశారని ఆయన మదిపడ్డారు .

మోడీ ఉగ్రవాద వ్యాఖ్యలను సవాల్ చేసిన పృధ్వీ రాజ్ చవాన్
ప్రధాని మోడీకి పృధ్వీరాజ్ఈ చవాన్ సవాల్ విసిరారు. ఆరోపణలకు మద్దతుగా ప్రధాని మోడీ వద్ద ఏదైనా రుజువు ఉంటే, ఆయన దానిని నిరూపించాలి అంటూ చాలెంజ్ చేశారు . రుజువు గురించి మాట్లాడకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. అంటే మోడీకి మాట్లాడటానికి వేరే సమస్య లేదని ఆయన అభిప్రాయపడ్డారు . నిరుద్యోగం వంటి ప్రాథమిక సమస్యల గురించి మాట్లాడటానికి వారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేసిందేమీ లేదని పృథ్వీరాజ్ చవాన్ పేర్కొన్నారు.

చైనా సమస్యపై మోడీ మాట్లాడాల్సిన అవసరం లేదు
తాను సృష్టించిన చైనా సమస్యపై ప్రధాని మోదీ మాట్లాడాల్సిన పని లేదని పేర్కొన్నారు. బహిరంగంగా ఏం మాట్లాడినా ప్రధాని మోదీ నియంతలా ఉండాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆర్థికవేత్తలు, ఎన్జీవోలు అంచనా వేస్తున్నారని ఆయన తెలిపారు. ఆయన బహిరంగ సభలలో ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు.
Recommended Video

కొనసాగుతున్న ఎన్నికలు .. సర్వత్రా ఉత్కంఠ
పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు గోవాలలో పోలింగ్ జరిగింది. యుపి అసెంబ్లీ ఎన్నికల యొక్క ఏడు దశలలో మూడు పూర్తయ్యాయి మరియు మిగిలిన దశలకు ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3 మరియు మార్చి 7 తేదీలలో ఓటింగ్ కొనసాగుతుంది. మణిపూర్ ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications