Sanjana Jatav: పాతికేళ్లకే ఎంపీగా ఎన్నికైన కానిస్టేబుల్ భార్య సంజన..! ఈసారి రికార్డు..
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో నమోదైన సంచలనాల్లో రాజస్థాన్ లోని భరత్ పూర్ ఎంపీగా గెలిచిన సంజనా జాతవ్ విజయం ఒకటి. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చి పాతికేళ్లకే ఎంపీగా సంజన సాధించిన విజయాన్ని ఇప్పుడు దేశం చర్చించుకుంటోంది. రాజస్థాన్ కాంగ్రెస్ లో దళిత నాయకురాలు అయిన సంజన ఓ కానిస్టేబుల్ భార్య. అయితేనేం భరత్ పూర్ లో ఎంపీగా ఆమె గెలుపు పార్లమెంట్ లో ఈసారి ఆమెను యువ ఎంపీల సరసన చేర్చింది.
18వ లోక్ సభకు పాతికేళ్లకే ఎంపీలుగా ఎన్నికైన ఇద్దరు ఎంపీల్లో సంజనా జాతవ్ ఒకరు. 2019లో రాజస్థాన్ లోని మహారాజా సురాజ్ మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన సంజన.. కానిస్టేబుల్ కప్తాన్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు. తాజాగా ఎన్నికల సందర్భంగా ఆమె సమర్పించిన అఫిడవిట్ లో తనకు 23 లక్షల ఆస్తులు ఉన్నాయని, 7 లక్షల అప్పులు ఉన్నాయని పేర్కొంది.

Sanjana Jatav, one of the youngest Dalit women to become an MP is enjoying democracy.pic.twitter.com/8pJI8HWfNr
— The Dalit Voice (@ambedkariteIND) June 4, 2024
గతేడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆమెను టికెట్ ఇచ్చి నిలబెట్టింది. అయితే బీజేపీ అభ్యర్ధి చేతిలో కేవలం 409 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి ఎంపీగా సంజనకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. దీంతో గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెల్చుకోని కాంగ్రెస్ పార్టీకి ఈసారి గెలుపు రుచి చూపించిన ఎంపీల్లో ఒగరుగా సంజన నిలిచారు. రాజస్థాన్ లో ఈసారి 25 ఎంపీల్లో బీజేపీ 14 ఎంపీలు గెల్చుకుంటే కాంగ్రెస్ 8 ఎంపీల్ని గెలిచింది. ఇందులో సంజన కూడా ఒకరు. భరత్ పూర్ లో బీజేపీ అభ్యర్ధి రామ్ స్వరూప్ కోలీని ఆమె 52 వేల ఓట్ల మెజార్టీతో ఓడించి పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు.












Click it and Unblock the Notifications