కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి: 2 దశాబ్దాల తర్వాత గాంధీయేతరుల పోటీ

న్యూఢిల్లీ: సోమవారం (అక్టోబర్ 17)నాడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత జరుగుతోన్న పార్టీ అధ్యక్ష ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ ఎన్నికల విభాగం తెలిపింది. పోలింగ్‌లో సభ్యులకు కీలక సూచనలు చేసింది.

బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థి పేరు ముందు 1 లేదా 2 అనే అంకెలకు బదులు టిక్ మార్క్ చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాల పీసీసీ సభ్యులకు చేరవేశామని తెలిపింది. కాగా, రహస్య బ్యాలెట్ ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఏ అభ్యర్థికి ఎవరు ఓటు వేశారనే విషయం తెలుసుకోవడం సాధ్యం కాదు.

ఓటు వేసే అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థి పేరు పక్కన టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల విభాగాధిపతి మధుసూదన్ మిస్త్రీ స్పష్టం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం 9100 మందికిపైగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా.. అక్టోబర్ 19వ తేదీన లెక్కింపు, తుది ఫలితాన్ని వెల్లడిస్తారు.

 Congress president polls: Stage set for non-Gandhi president after24 years

రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఈసారి గాంధీ కుటుంబేతర వ్యక్తులు పోటీ ఉండటంతో పోటీ ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. ఈ నేతలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. తమ ఇద్దరి మధ్య పోటీ స్నేహపూర్వకమేనని, ఎవరు ఎన్నికైనా పార్టీ కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు.

కాగా, భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్టోబర్ 17న యాత్రకు విరామం ఇచ్చి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. యాత్ర కొనసాగుతున్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా సంగనకల్లు క్యాంపు వద్దే రాహుల్ తన ఓటు వేస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+