వాఘేలా ఎఫెక్ట్: బెంగళూరుకు 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

మూడున్నరేళ్ల క్రితం ‘అచ్చేదిన్' నినాదంతో ఏటా కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్న హామీలతో దేశమంతటా ఊదరగొట్టి..

న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: మూడున్నరేళ్ల క్రితం 'అచ్చేదిన్' నినాదంతో ఏటా కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్న హామీలతో దేశమంతటా ఊదరగొట్టి.. చమత్కారాలతో ప్రజలందరినీ ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ... దేశంలో విపక్షాల ఉనికి లేకుండా చేయాలని అవమానకర రాజకీయాలకు తెర తీసింది.

అందులో భాగంగానే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరిచే కుట్రలకు పాల్పడుతున్నది. తద్వారా దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల పునరేకీకరణకు పాల్పడుతూ వచ్చిన కమలనాథులు తాజాగా అవమానకర రాజకీయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు.

ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం పక్కనబెట్టి విపక్ష పార్టీలను పూర్తిగా దెబ్బ కొట్టడమే లక్ష్యంగా.. అవే 'అచ్చేదిన్' అన్న రీతిలో పాలన సాగిస్తోంది. బీజేపీయేతర శక్తులకు స్ఫూర్తిగా నిలిచిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని తెర వెనుక రాజకీయం ద్వారా అవినీతి ఆరోపణలు గుప్పించి, సీబీఐతో దాడులు, ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుల నమోదుతో ముప్పేట దాడికి దిగింది.

లాలూ కుటుంబంపై ఇలా అవినీతి కేసులు

లాలూ కుటుంబంపై ఇలా అవినీతి కేసులు

2013లో ప్రదాని అభ్యర్థిగా మోదీని ప్రకటించినందుకు బయటకు వచ్చిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తూ.. అవినీతి రహితుడన్న ఆయనకు గల పేరు ప్రతిష్ఠలను అడ్డం పెట్టుకుని అధికారానికి, రాజకీయాలకు లాలూ కుటుంబాన్ని దూరం చేసేందుకు వ్యూహ రచన అమలుచేసి, విజయం సాధించింది. మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు చేసి, లాలూ కుటుంబాన్ని ఇరుకున బెట్టింది. తదనుగుణంగా సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత బీజేపీ రాజీనామాకు పట్టుబట్టడం.. సచ్చీలతను రుజువు చేసుకోవాలని నితీశ్ కుమార్ పదేపదే కోరడం జరిగాయి. అసలు 2014లో లాలూతో సుదీర్ఘ కాలం తర్వాత జత కట్టినప్పుడు ఆయన అవినీతి పరుడని నితీశ్ కుమార్‌కు తెలియదా? అంటే తెలుసు? కానీ అప్పటి పరిస్థితులే వేరు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయం కనిపించనందున ఎదురు దాడి వ్యూహానికి నితీశ్ కూడా సరెండరయ్యారా? లేక అధికారమే పరమావధిగా లాలూ కుటుంబాన్ని పక్కకు నెట్టేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామాల వ్యూహం

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామాల వ్యూహం

ఇక 1996 నుంచి గుజరాత్ లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరిచే కుట్రలకు తెర లేపింది. అందులో భాగంగా ఒకనాటి ఆరెస్సెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శంకర్ సింఘ్ వాఘేలాను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్న విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన శంకర్ సింఘ్ వాఘేలాల మద్దతు దారులతో సోనియాగాందీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాకుండా కుట్ర పన్నింది. దాని ఫలితంగానే ఇప్పటివరకు ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఒక ఎమ్మెల్యేను ఒక జిల్లా ఎస్పీ కిడ్నాప్ చేసి మరీ పార్టీ మారితే రూ.10 కోట్ల లంచం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నదన్న వార్త బయటకు వచ్చింది. అంటే తాము చేస్తే మంచి.. మిగతా వాళ్లంతా దొంగలన్న ముద్ర వేసేందుకు కూడా మోదీ - అమిత్ షా ద్వయం వెనుకాడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. అధికార బీజేపీ కల్పించిన రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ బెంగుళూరుకు తరలించింది.

కాంగ్రెస్ మునిగిపోయే నావ అన్న రవిశంకర్ ప్రసాద్

కాంగ్రెస్ మునిగిపోయే నావ అన్న రవిశంకర్ ప్రసాద్

ఎమ్మెల్యేలను బెంగుళూరుకు తరలించడంపై మాట్లాడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పర్మార్‌.. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు పడిపోకుండా ఉండటం కోసమే వారిని దూరంగా తీసుకెళ్తున్నట్లు చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రలోభాలకు పాల్పడుతోందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు ఆఫర్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పునాభాయ్‌ గమిట్‌ ఆరోపించారు. పదేపదే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించడంతో తొలుత 16 మంది ఎమ్మెల్యేలను ఆనంద్ జిల్లాలోని నీజానంద్, మరో 11 మందిని రాజ్ కోట్ సమీపాన ఒక ఫామ్ హౌస్ కు తరలించింది. కాంగ్రెస్‌ నేతల ఆరోపణలపై స్పందించిన కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. బీజేపీ డబ్బు ఇవ్వజూపుతోందన్న ఆరోపణలపై నవ్వేశారు. కాంగ్రెస్‌ ఓ మునిగిపోయే నావని అన్నారు. మునిగిపోయే నావలో ఉన్నవారందరూ ఎలాగొలా బయటపడటానికి ప్రయత్నిస్తారని.. ఈ ఆరోపణ కూడా అలాంటిదేనని అన్నారు.

వాఘేలా రాజీనామా తర్వాత అమిత్ షా వ్యూహం ఇలా

వాఘేలా రాజీనామా తర్వాత అమిత్ షా వ్యూహం ఇలా

కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు బెంగుళూరుకు చేరుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉండేందుకు వారందరినీ బెంగుళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి శంకర్ సింఘ్ వాఘేలా రాజీనామా చేసిన తర్వాత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీని చావుదెబ్బ తీసేందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం వ్యూహ రచన చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, అభిషేక్ మను సింఘ్వీ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. శుక్రవారం రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తితే పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఎద్దేవా చేశారు. పైపెచ్చు గుజరాత్ రాష్ట్రానికి అపకీర్తి తెచ్చిపెట్టే వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు. మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా స్పందిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ సొంతింటి వ్యవహారమని, రాజ్యసభలో ఏమీ చేసేదీ లేదని ఎదురు దాడికి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+