ప్రజాతీర్పును శిరసావహిస్తోన్నా: ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమల్ నాథ్..

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. 20 మంది కమల దళ అభ్యర్థులు ఉండగా.. కేవలం ఏడుగురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఆధిక్యం స్పష్టం కావడంతో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ స్పందించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని అంగీకరించారు.

బై పోల్‌లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని కమల్ నాథ్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థుల లీడ్‌ ఉన్న చోట ఓటర్లు చూపిన అభిమానానికి థాంక్స్ చెప్పారు. 7 నెలల క్రితం జ్యోతిరాదిత్య సిందియా కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. సిందియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. దీంతో కమల్ నాథ్ సీఎం పీఠం నుంచి దిగాల్సి వచ్చింది.

Congress’s Kamal Nath concedes defeat in Madhya Pradesh bypoll

ఆ తర్వాత ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. అయితే 20 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా వెళుతున్నారు. 7 చోట్ల కాంగ్రెస్, బీఎస్పీ నుంచి ఒకరు లీడ్‌లో ఉన్నారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు ముగ్గురు ఆదిల్ సింగ్ కాన్సానా, గిరిరాజ్ దండొటియా, ఓపీఎస్ భడొరియా ట్రయల్‌లో ఉండటం విశేషం. భడొరియా 175 ఓట్ల దూరంలో ఉన్నారు.

Recommended Video

    Election Results 2020:బిహార్ తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 57 ఉపఎన్నికల ఫలితాలు|#Biharelectionresults

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+