మాకే ఇవ్వాలి, హక్కుంది: సోనియా, నక్వీ చురకలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాల్సిందేనని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని సోనియా సోమవారం పార్లమెంటు ప్రాంగణలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పార్లమెంటులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ తమదే అన్నారు.

ప్రతిపక్ష హోదాకు కాంగ్రెసు పార్టీకి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే మీరేం చేస్తారని ప్రశ్నించగా.. చూడాలన్నారు. కాగా, మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన లోకసభ మరోసారి రెండు గంటల వరకు వాయిదా పడింది. రెండు గంటలకు లోకసభ మళ్లీ ప్రారంభమైనా గందరగోళం ఏర్పడటంతో సభాపతి మంగళవారానికి వాయిదా వేశారు.

Congress Should Get Leader of the Opposition Post, Says Sonia

జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆందోళన

ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు.

గొంతు చించుకోవద్దు: నక్వీ

ధరలు పెరిగాయని ప్రతిపక్షాలు అనవసరంగా గొంతు చించుకోవడం మానుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సూచించారు. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధరల పెరుగుదల ప్రయోజనాలు త్వరలోనే చూస్తారన్నారు.

గత పదేళ్లలో దేశంలో పేదరికం రూపుమాపేశామని యూపీఏ ప్రభుత్వం చెప్పిందని, అలా పేదరికాన్ని రూపుమాపితే ధరలు పెరిగాయని గొంతు చించుకోవడమెందుకని ఆయన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. అంటే పేదరికం అలానే ఉందని వారే ఒప్పుకుంటున్నారన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ధరలు పెంచామన్నారు. గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఎన్డీయే ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+