మోడీ వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్-రాజ్యసభ నుంచి వాకౌట్- ఖర్గే వ్యాఖ్యలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోయాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా పార్లమెంట్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్.. రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ప్రధాని మోడీ నిన్న లోక్ సభలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. దీంతో ప్రధాని మోడీ తీరుపై కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం దీనిపై స్పందించిన విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే... మోడీ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానంలో పథకాలపై మాట్లాడకుండా కాంగ్రెస్ ను టార్గెట్ చేయడమేంటని ఆయన మోడీని ప్రశ్నించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రచారంపై పలు ఆంక్షలు విధించింది. దీంతో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ప్రధాని మోడీ సహా ఇతర ప్రధాన నేతలంతా వర్చువల్ ర్యాలీలకు పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ప్రధాని మోడీ.. తమ ప్రధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. దీంతో ఈ పరిణామాన్ని ముందుగా ఊహించని కాంగ్రెస్ పార్టీ అనంతరం విమర్శలకు దిగుతోంది.












Click it and Unblock the Notifications