వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక కాంగ్రెస్ లిస్టులో చిరంజీవి, రమ్య (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున... కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి కర్నాటకలోను ప్రచారం చేయనున్నారు.

కర్నాటక రాష్ట్ర కాంగ్రెసు పార్టీ యూనిట్ ఎన్నికల సంఘానికి తమ స్టార్ ప్రచారకర్తల వివరాలను ఇచ్చింది. అందులో చిరంజీవి పేరు కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిరంజీవితో పాటు మాండ్య ఎంపి, ప్రముఖ నటి రమ్య, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరుల పేర్లు ఉన్నాయి.

సోనియా గాంధీ

సోనియా గాంధీ

కాంగ్రెసు పార్టీ కర్నాటక యూనిట్ ప్రచారకర్తల లిస్టులో సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, చిరంజీవి, రమ్య తదితర నలభై వరకు పేర్లు ఉన్నాయి.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. ఆయన త్వరలో కర్నాటకలో ప్రచారం నిర్వహించనున్నారు.

మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రచారానికి వచ్చే అవకాశముంది. యూపిఏ ప్రభుత్వం రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉంది. మన్మోహన్ ప్రధానిగా ఉన్నారు.

దిగ్విజయ్ సింగ్

దిగ్విజయ్ సింగ్

కాంగ్రెసు పార్టీ ప్రధాన ప్రచారకర్తలలో ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.

సిద్ధరామయ్య

సిద్ధరామయ్య

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలుపుకొని వెళ్తున్నామని చెబుతున్నారు. సిద్ధరామయ్య కర్నాటకలో ఎక్కువ లోకసభ స్థానాలను గెలిపించి సత్తా చాటాలనుకుంటున్నారు.

పరమేశ్వరన్

పరమేశ్వరన్

కర్నాటక కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు పరమేశ్వరన్ లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెసు పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి గత ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. తెలుగు వాళ్లు అధికంగా ఉండే చోట చిరు ప్రచారం చేయనున్నారు. ఆయన ప్రచారానికి గతంలో అభిమానులు, చూసేందుకు ప్రజలు పోటెత్తారు. కర్నాటకలో ఇతర కాంగ్రెసు నేతలకు ధీటుగా కొన్ని ప్రాంతాల్లో చిరంజీవికి ఆదరణ లభించింది.

 రమ్య

రమ్య

మాండ్య పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి రమ్య కర్నాటక కాంగ్రెసు పార్టీకి పెద్ద ఎసెట్. రానున్న ఎన్నికల్లో ఆమె మాండ్య నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేస్తున్నారు.

 ఎస్ఎం కృష్ణ

ఎస్ఎం కృష్ణ

ఎస్ఎం కృష్ణ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

వీరప్ప మొయిలీ

వీరప్ప మొయిలీ

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ... ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి. ఆయన కర్నాటకలో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు.

స్టార్స్

స్టార్స్

కర్నాటక కాంగ్రెసు ఎన్నికల ప్రచారం లిస్టులో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, మహారాష్ట్ర సిఎం పృథ్వీరాజ్ చవాన్, కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, అంబికా సోని, విప్ ఆస్కార్ ఫెర్నాండేజ్ తదితరులు ఉన్నారు.

English summary
Elections 2014 : Elections 2014 : Karnataka state unit of Congress handed over a list of its star campaigners to the Election Commission. The first name in the list is party president Sonia Gandhi there are altogether 40 names in the list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X