బీజేపీకి షాక్! పంజాబ్‌లో కాంగ్రెస్ సత్తా: సివిక్ పోల్స్‌లో క్లీన్‌స్వీప్, రిగ్గింగ్ ఆరోపణలు
ఛండీఘర్: ఓ వైపు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుండగానే.. పంజాబ్ రాష్ట్రంలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి సంచలనం సృష్టించింది.
ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ.. ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. జలంధర్, పటియాలా, అమృతసర్‌లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందింది.

ప్రతిపక్షానికి చెంపపెట్టు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ పాలసీలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు. విద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి మున్సిపల్ ఎన్నికల తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.

భారీగా రిగ్గింగ్‌కు పాల్పడింది...
కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు గుప్పించాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిందని, పటియాలలో భారీగా రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి ఆరోపించింది.

బీజేపీ, అకాళీధల్ ఘోర పరాజయం
జలంధర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 80 స్థానాలకు గాను 66 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి 12 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

కాంగ్రెస్ కంచుకోటలా పంజాబ్
కాగా, పటియాలాలో 60 సీట్లకు గాను 58 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అమృతసర్‌లో సైతం కాంగ్రెస్ హవా నడిచింది. మొత్తం 85 స్థానాల్లో 63 స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటి పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ కంచుకోటలా మారుతుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications