Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పని చేస్తాం: బీజేపీ కుట్రలంటూ రాహుల్ గాంధీ ఫైర్

నాగ్‌పూర్: కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో నిరుద్యోగ రేటు గత 40 ఏళ్లలో అత్యధిక శాతానికి చేరుకుందని ఆరోపించారు. దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్​ 139వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాగ్‌పుర్‌​లో 'హై తయార్​ హమ్​' (మేం సిద్ధంగా ఉన్నాం) పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు.

రాజకీయ అధికారం కోసం జరిగే పోరాటానికి సిద్ధాంతమే పునాది అని.. సామాన్యులకు అధికారాన్ని అప్పగించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ చాలా మంది ప్రజలను మళ్లీ పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రతిభ ఆధారంగా కాకుండా అనుకూలమైన వారికే విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల బాధ్యతలు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

 Congress To Conduct Caste Census Once Elected To Power: Rahul Gandhi speech On Foundation Day meeting

ఇండియా కూటమే దేశ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలదని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాదిరి కాకుండా తమ పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కూడా నాయకత్వాన్ని ప్రశ్నించగలడని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్తలన్నింటినీ బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ అధికారం కోసం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఇది(నాగ్‌పూర్) కాంగ్రెస్‌ పార్టీ గడ్డ. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్‌ సిద్ధాంతాల గురించి చెప్పకపోయినా అర్థమవుతాయి. కాంగ్రెస్‌ పోరాటం మహారాష్ట్ర నుంచే మొదలైంది, అందువల్ల మీతో మాట్లాడేందుకు నాగ్‌పుర్‌ వచ్చాం. మీరు ఎవరికీ భయపడకూడదు. సిద్ధాంతాల కోసం మనస్ఫూర్తిగా చేస్తున్న పోరాటం ఇది. మనమంతా కలిసి మహారాష్ట్రతోపాటు దేశంలో జరిగే ఎన్నికల్లో గెలవబోతున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు.


ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే దేశంలో భారతీయ జనతా పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష కూటమిని బలపర్చాలని ప్రజలను కోరారు. పార్లమెంటులో అలజడికి సంబంధించి బీజేపీ తమ ఎంపీని కాపాడేందుకు 147 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటికి పంపిందని ఖర్గే ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తే మహిళలకు సాధికారత కల్పించే న్యాయ్‌ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+