మోడీ కుట్రతోనే కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్ ! భగ్గుమన్న సోనియా, రాహుల్, ఖర్గే..

దేశమంతా లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేస్తూ ఆదాయపు పన్నుశాఖ తీసుకున్న నిర్ణయంపై అగ్రనేతలు ఇవాళ మండిపడ్డారు. 14 లక్షల మేర అక్రమాలు జరిగాయన్న సాకుతో రూ.210 కోట్ల జరిమానా విధించడం ఓ అరాచకం అయితే, అది కట్టలేదంటూ ఎన్నికల వేళ బ్యాంకు ఖాతాల్ని ఎలా స్తంభింపజేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా, రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీని ఆర్ధికంగా దిగ్బంధించాలన్న మోడీ కుట్ర ఉందన్నారు.

ఓ వ్య‌వ‌స్థీకృత ప‌ద్ధ‌తిలో ప్ర‌ధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నార‌ని మాజీ ఏఐసీసీ ఛీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, దీని ప్రభావం కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలపైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు ప్ర‌ధాని మోదీ వ్య‌వ‌స్థీకృత దాడి చేస్తున్నార‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి తాము విరాళాలుగా స్వీకరించిన నిధుల్ని ఇప్పుడు జప్తు చేశారని ఆరోపించారు.

congress top leaders fire against party s bank accounts freezure says modi s systematic effort

చాలా విప‌త్క‌ర ప‌రిస్థితులు, స‌వాళ్ల మ‌ధ్య తాము ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని సోనియా తెలిపారు. ఎల‌క్టోర‌ల్ బాండ్లు రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని సుప్రీంకోర్టు పేర్కొందని, వీటి వ‌ల్ల బీజేపీకే చాలా లాభం చేకూరింద‌ని, కానీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జ‌రుగుతున్న‌ట్లు సోనియా ఆరోపించారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల విష‌యంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు అసాధార‌ణ‌మైన‌వ‌ని, అప్ర‌జాస్వామిక‌మైన‌వ‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభన ప్రభావం తమ ప్రచారంపై పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ పార్టీ మ‌ద్ద‌తుదారులు, అభ్య‌ర్దులకు దీంతో మద్దతు ఇవ్వలేకపోతున్నట్లు ఆయన వెల్లడించారు. త‌మ నేత‌లు ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్ట‌లేక‌పోతున్నారని, ఎన్నిక‌ల వేళ త‌మ పార్టీ ప్రకటనలు కూడా ఇవ్వ‌లేక‌పోతున్న‌ట్లు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి రెండు నెల‌ల ముందే త‌మ పార్టీని నిర్వీర్యం చేశార‌ని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి షా.. క్రిమిన‌ల్ చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు రాహుల్ ఆరోపించారు.

కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా.. ఒక్క కోర్టు కూడా ఎటువంటి వాస్తవాన్ని బయటపెట్టలేకపోతోందని, ఎన్నిక‌ల సంఘం కూడా మౌనంగా ఉండిపోతోందన్నారు. దేశంలో మ‌రే సంస్థ కూడా నోరు మెద‌ప‌డం లేద‌న్నారు. మీడియా కూడా ఏమీ చెప్ప‌డం లేద‌ని రాహుల్ విమ‌ర్శించారు. భార‌త్‌లో ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం లేద‌ని, రాజ్యాంగ‌, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌జ‌ల నుంచి దూరు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+