మోదీనే కాదు తనను కూడా కాంగ్రెస్ వేధించింది : సాద్వి
భోపాల్ : కాంగ్రెస్ పార్టీపై సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, తనను కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలను బెదిరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న హింసకు తాను, మోదీ సాక్ష్యమని పేర్కొన్నారు. దేశభక్తులను ఉగ్రవాదులుగా ముద్రవేసే కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధిచెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్యాయం, అరాచకం
కాంగ్రెస్ పాలనలో అన్యాయమే రాజ్యమేలింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో .. ఆయన పలు నేరాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కానీ అవన్నీ అవాస్తవాలని తేలాయని గుర్తుచేశారు సాద్వి. మోదీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. అదేవిధంగా తనను కూడా కాంగ్రెస్ నిందించిందని గుర్తుచేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మోదీనే కాదు తనను కూడా టార్చర్ పెట్టిందని ఆరోపించారు.
ఆరోపణలే కదా ?
2008 మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రఙ్ఞాకు టికెట్ ఎలా ఇచ్చారని మోదీని మీడియా ప్రశ్నించగా.. కాంగ్రెస్ తనను కూడా ఎన్నో విషయాల్లో నిందితుడిగా చిత్రీకరించిందని బదులిచ్చారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా లక్షల కొద్దీ పోస్టులుంటాయని, అలాంటి వారి వల్ల అమెరికా తనకు వీసా నిరాకరించిందని పేర్కొన్నారు. అయితే వాస్తవాలు వెల్లడైన తర్వాత తనకు వీసా నిరాకరించిన వారే స్వయంగా అమెరికాకు రావాలంటూ ఆహ్వానించారని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications