ఉల్లాసంగా, ఉత్సాహంగా రాహుల్ గాంధీ

గుహవాటి: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నడూ లేనంత ఉల్లాసంగా, ఉత్సహంగా దర్శనం ఇచ్చారు. శనివారం అసోం పర్యటనకు వెళ్లిన ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు.

మీడియా ప్రతినిధులతో కలిసి అల్పాహార విందు చేశారు. అయితే మీడియా అడిగిన చాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాహుల్ గాంధీ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దాటవేశారు.

తరువాత సుమారు గంట పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలతో సహ అసోం ఎన్నికలు గురించి పిచ్చపాటిగా మాట్లాడారు. మీరు లోక్ సభ, రాజ్యసభలో నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతో ఆరోపణలు చేసుకుంటూ ఉభయ సభలు సవ్యంగా జరకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయని ప్రశ్నించారు.

Congress vice president Rahul Gandhi said in Guwahati on Saturday.

నేషల్ హెరాల్డ్ కేసు అడ్డం పెట్టుకుని జీఎస్టీ బిల్లును అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ కొంచెం తడబడ్డారు. చివరికి నేషనల్ హెరాల్డ్ కేసుకు జీఎస్టీ బిల్లుకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ గాంధీ చెప్పారు.

మాకు ప్రధానంగా మూడు ఆందోళనలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటే జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తామని రాహుల్ గాంధీ వివరించారు. అయితే ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని వెళ్లిన అనేక మంది పాత్రికేయులు నిరాశ చెందారు. 2016 లో అసోంలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తరుణ్ గోగాయ్ ని ప్రకటిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+