తిమ్లి డ్యాన్స్ చేసిన రాహుల్‌గాంధీ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు.స్థానిక నృత్యకారులతో కలిసి తిమ్మి డ్యాన్స్ చేశారు రాహూల్‌గాంధీ.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తిమ్లి డ్యాన్స్‌ చేశారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఛోటా ఉదయ్‌పూర్‌ జిల్లాలో పర్యటించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా పాటీదార్‌ వర్గీయులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ నేపథ్యంలోనే స్థానిక నృత్యకారులు తిమ్లి డ్యాన్స్‌ చేస్తూ రాహుల్‌కు స్వాగతం పలికారు. వాళ్లని చూడగానే.. రాహుల్‌ కూడా వారితో కలిసి సరదాగా నృత్యం చేశారు.
సోమవారం నుంచి గుజరాత్‌లో రెండో దశ నవసర్జన్‌ యాత్రను రాహుల్‌ ప్రారంభించారు.

.తన పర్యటనలో భాగంగా ఆయన వడోదరతో పాటు పలు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను కలుసుకున్నారు. స్థానికుల సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్‌ ఈ నవసర్జన్‌ యాత్రను చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rahul Gandhi has rarely looked happier in public than he did on Tuesday evening, when he - drum in hand - joined dancers in Gujarat's Chhota Udaipur district for a 'Timli' performance.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి