వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీలా అబద్దాలు చెప్పను! కొడుకుననుకొని దీవించండన్న రాహుల్ గాంధీ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : మోడీలా అబద్దాలు చెప్పను : రాహుల్ గాంధీ || Oneindia Telugu

వయనాడ్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ జోరు పెంచారు. తొలిసారి దక్షిణాది నుంచి బరిలో దిగుతున్న ఆయన కేరళలోని వయనాడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలిసారి వయనాడ్‌లో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఓటర్లు తనను కొడుకుగా భావించి దీవించాలని కోరారు. అంతకు ముందు తిరునెల్లి ఆలయాన్ని సందర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎన్నికల అఫిడవిట్‌లో తేడాలు మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదుఎన్నికల అఫిడవిట్‌లో తేడాలు మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

మోడీలా అబద్దాలు చెప్పను

మోడీలా అబద్దాలు చెప్పను

వయనాడ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మోడీ తీరును కడిగిపారేశారు. తాను మోడీలాంటి వాడిని కాదని, ఆయనలా తనకు అబద్దాలు చెప్పడం రాదని అన్నారు. కేరళ ప్రజలతో జీవితాంతం సత్సంబంధాలు కొనసాగించేందుకే వచ్చానని అన్నారు. తనను ఒక కొడుకులా, బెస్ట ఫ్రెండ్‌లా చూడాలని కోరారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15లక్షలు జమ చేస్తానని మోడీలా అబద్దాలు చెప్పనని రాహుల్ స్పష్టం చేశారు.

తిరునెల్లి ఆలయంతో ప్రత్యేక పూజలు

తిరునెల్లి ఆలయంతో ప్రత్యేక పూజలు

ప్రచారానికి వెళ్లే మందు రాహుల్ తిరునెల్లి ఆలయాన్ని సందర్శించారు. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇతర నాయకులు పూజల్లో పాల్గొన్నారు.

పితృ దేవతలకు పూజలు

పితృ దేవతలకు పూజలు

ఆలయాన్ని దర్శించిన అనంతరం రాహుల్ గాంధీ పితృ దేవతల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజీవ్‌గాంధీ అస్తికలను నిమర్జనం చేసిన పాపనాశని నదీ తీరాన శాస్త్రోక్తంగా ఈ తంతు జరిపారు. తండ్రి, నాయనమ్మతో పాటు పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు రాహుల్ తర్పణాలు వదిలారు. గతంలోనూ ఆయన పాపనాశని వద్ద పూజలు చేయాలని భావించినా భద్రతా కారణాలరిత్యా వీలుకాలేదు.

English summary
At his first poll rally in Kerala’s Wayanad after choosing it as his second Lok Sabha seat, Rahul Gandhi on Thursday said he wanted to send out a message by contesting from the south. Earlier Congress President Rahul Gandhi offered prayers and performed rituals for his late family members as well as victims of the Pulwama terror attack at Thirunelli temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X