వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్నే ఆపుతావా?కాళ్లు పట్టుకో: పోలీసుతో బిజెపి నేత

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌: విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌తో అమర్యాదగా ప్రవర్తించి విమర్శల పాలవుతున్నారు ఓ భారతీయ జనతా పార్టీ నాయకుడు. విధి నిర్వహణలో భాగంగా కానిస్టేబుల్ ఆ నేత వాహనాన్ని ఆపి తనిఖీ చేశాడు. ఇందుకు ఆగ్రహించిన ఆ నేత.. తన కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని హుకుం జారీ చేశాడు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. ఓం ప్రకాశ్‌ ధనావత్‌ అనే ఓ బిజెపి నాయకుడు తన కారులో వెళుతుండగా గంగారాం అనే కానిస్టేబుల్‌ తనిఖీ నిమిత్తం అతని కారు ఆపాడు. కాగా, తాను బిజెపి నేతనంటూ ఐడీ చూపించినా కానిస్టేబుల్‌ వినిపించుకోకుండా అతన్ని కారు దిగమని తనిఖీ చేశాడు.

Constable forced to touch BJP leader's feet for stopping his car at police check-post

విధి నిర్వహణ పట్ల కానిస్టేబుల్‌కి ఉన్న నిబద్ధతకు మెచ్చుకోవాల్సింది పోయి ఆ నేత ఆగ్రహించారు. నిమిషాల్లో తన కార్యకర్తలను పిలిపించారు. వారందరూ గంగారాంని చుట్టుముట్టడంతో భయపడిపోయిన గంగారాం ఓంప్రకాశ్‌ని క్షమాపణలు కోరాడు. అయినా వారు ఒప్పుకోకుండా కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరమని బలవంతం చేశారు.

కాగా, ఇదంతా స్థానిక మీడియా క్లిక్‌మనిపించడంతో ఆ ఫొటో వైరల్‌ అయింది. అయితే తాను కానిస్టేబుల్‌ని కాళ్లుపట్టుకోమని అడగలేదని అతని ప్రవర్తన నచ్చక ఇద్దరి మధ్య చిన్న గొడవైందని, అంతకంటే మరేం లేదని బిజెపి నేత ఓం ప్రకాశ్‌ చెప్పుకొచ్చారు. అయితే తాను బిజెపి నేతతో దురుసుగా ప్రవర్తించలేదని, కాళ్లు పట్టుకోలేదని కానిస్టేబుల్‌ తెలిపాడు.

English summary
BJP leader Om Prakash Danauth on Thursday allegedly forced a police head constable to touch his feet for stopping his car at a check post in Gwalior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X