అందమైన గర్ల్ ఫ్రెండ్: కిడ్నాప్ లు చేసిన కానిస్టేబుల్
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లో ఓ కానిస్టేబుల్ తన ప్రియురాలితో కలిసి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఓ బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు.
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ లో మనీష్ కశ్యప్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మనీష్ కశ్యప్ గర్ల్ ఫ్రెండ్ శారద. సమాజంలో శాంతిభద్రతలు కాపాడాల్సింది పోయి ప్రియురాలితో కలిసి జల్సాలు చెయ్యడం మొదలు పెట్టాడు.

అప్పనంగా డబ్బు సంపాధించి ప్రియురాలితో కలిసి జల్సాలు చెయ్యాలని స్కెచ్ వేశాడు. ఈనెల 6వ తేదిన పదేళ్ల బాలుడిని మనీష్ కశ్యప్, అతని ప్రియురాలు శారద కలిసి కిడ్నాప్ చేశారు. తరువాత రూ. 35 లక్షలు ఇవ్వాలని బాలుడి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు.
రూ. 35 లక్షలు ఇవ్వకుంటే మీ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కిడ్నాపర్ల మొబైల్స్ ట్రాప్ చేశారు. చివరికి కిడ్నాప్ చేసింది కానిస్టేబుల్ మనీష్ కశ్యప్ అని తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ కు గురైనారు. మనీష్ కశ్యప్, శారదను అరెస్టు చేశామని, బాలుడిని క్షేమంగా రక్షించామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications