Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్లమెంటులో రాజ్యాంగ దినోత్సవం-ప్రధాని మోడీ కీలక ప్రసంగం-ముంబై అమరులకు నివాళి

భారత రాజ్యాంగం నిర్మితమై 71 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.

పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఇవాళ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. పార్లమెంటులో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఇతర ప్రముఖులు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడంపై పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. రాజ్యాంగం, మన సాంస్కృతిక వారసత్వం, ఇతర విలువలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రసంగం చేశారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు.

Constitution Day celebrations in parlament, pm modi tributes to 26/11 martyrs, says nation first

దేశ ఉజ్వల భవిషత్తు కోసం మన పెద్దలు ఎన్నో ఇచ్చారని,అందులో రాజ్యాంగం కూడా ఒకటని ప్రధాని మోడీ తెలిపారు. ఆ రాజ్యాంగమే మనల్ని రోజూ నడిపిస్తోందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో త్యాగాలు చేశారని, వారందరి త్యాగాల్ని పార్లమెంటు గుర్తుంచుకుంటుందన్నారు. శత్రుమూకలు ముంబైలో ఇదే రోజు విధ్వంసం సృష్టించారని, తీవ్రవాదులతో పోరులో ఎందరో జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, వారందరికీ పార్లమెంటు నివాళులు అర్పిస్తోందని మోడీ తెలిపారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తోందంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు.

Constitution Day celebrations in parlament, pm modi tributes to 26/11 martyrs, says nation first

రాజ్యాంగం ప్రకారమే దేశంలో వ్యవస్ధలు పనిచేస్తున్నాయని, మనం ఏం చేయాలన్నా రాజ్యాంగం ప్రకారంఅది సరైనదా కాదా అన్నది తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. రాజ్యాంగం దేశంలో కోట్లాది మంది ప్రజలకు కరదీపికగా, దిక్సూచిగా మారిందని మోడీ వెల్లడించారు. ఈ దేశానికి బాబా సాహెబ్ అంబేద్కర్ బహుమతి రూపంలో ఇచ్చిన రాజ్యాంగాన్ని మనమంతా తూచా తప్పకుండా పాటించాలన్నారు.

Constitution Day celebrations in parlament, pm modi tributes to 26/11 martyrs, says nation first

రాజ్యాంగం ప్రకారమే దేశంలో వ్యవస్ధలు పనిచేస్తున్నాయని, మనం ఏం చేయాలన్నా రాజ్యాంగం ప్రకారం అది సరైనదా కాదా అన్నది తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. రాజ్యాంగం దేశంలో కోట్లాది మంది ప్రజలకు కరదీపికగా, దిక్సూచిగా మారిందని మోడీ వెల్లడించారు. ఈ దేశానికి బాబా సాహెబ్ అంబేద్కర్ బహుమతి రూపంలో ఇచ్చిన రాజ్యాంగాన్ని మనమంతా తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా, మన హక్కులు రక్షించబడేలా విధి మార్గంలో ముందుకు సాగడం అవసరమని ప్రధాని తెలిపారు. భారతదేశం సంక్షోభం వైపు వెళుతోందని, ఇది రాజ్యాంగం పట్ల అంకితభావంతో ఉన్నవారికి ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోడీ తెలిపారు. ముఖ్యంగా కుటుంబ పార్టీల తీరు అని ప్రధాని పేర్కొన్నారు.

Constitution Day celebrations in parlament, pm modi tributes to 26/11 martyrs, says nation first

అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. పీఠిక రాజ్యాంగం యొక్క తత్వశాస్త్రాన్ని క్లుప్తంగా వివరిస్తుందని దీనిలో ప్రజలు మన దేశాన్ని ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఇష్టపడతారని ఆయన తెలిపారు. మన అభివృద్ధికి ప్రజలు కేంద్రంగా ఉన్నారని తమ దృఢ విశ్వాసం అన్నారు. పార్లమెంటులో అర్ధవంతమైన చర్చలు జరిగేలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి కోరారు. దేశ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములేనన్నారు. ప్రధాని మోడీ కూడా సబ్ కా సాధ్ సబ్ కా వికాస్ నినాదంతోనే ముందుకు వెళ్తున్నారని వెంకయ్య తెలిపారు. మనమంతా ఒక దేశం, ఒకే ప్రజలని ఆయన గుర్తుచేశారు. మన రాజ్యాంగం ఓ సజీవ పత్రమని అభివర్ణించారు.

అనంతరం రాజ్యాంగం డిజిటల్ కాపీని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. రాజ్యాంగం గొప్పతనాన్ని మరోసారి గుర్తుచేశారు. 72 సంవత్సరాల క్రితం, ఈ సెంట్రల్ హాల్‌లో, మన రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ పత్రాన్ని స్వీకరించారని. భారతదేశ అభివృద్ధి ప్రయాణం మన రాజ్యాంగం యొక్క బలంతో పురోగమిస్తోందని తాను నమ్ముతున్నానని కోవింద్ తెలిపారు. చివర్లో రాజ్యాంగ పీఠికని రాష్ట్రపతి కోవింద్ ఎంపీలు, ప్రముఖులతో చదివించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+