70 ఏళ్లుగా రాజ్యాంగం అమలు కాలేదు, ఆర్టికల్ 370 గోడ బద్దలు కొట్టామన్న మోడీ..!
భారత మాజీ హోంమంత్రి సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని సర్దార్ పటేల్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించిన ప్రధాని .. అనంతరం ప్రసంగించారు. దేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ పటేల్ చేసిన కృషిని ప్రధాని గుర్తుచేసుకున్నారు. సమాజంలో ఐక్యతా బంధాల్ని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బిజెపి ప్రభుత్వ దార్శనికత జాతీయ ఐక్యత పట్ల దాని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రదాని మోడీ గుర్తుచేసారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఒక దేశం-ఒకే పన్ను విధానాన్ని తీసుకొచ్చామని, ఆర్టికల్ 370 గోడను బద్దలు కొట్టామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల వివక్షాపూరిత విధానాలు, ఉద్దేశాలు జాతీయ ఐక్యతను బలహీనపరిచాయని మోడీ ఆరోపించారు. గత 10 సంవత్సరాలలో తమ పాలన వివక్షను తొలగించిందన్నారు.

తాము ఎంచుకున్న సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ మార్గం ప్రజలలో అసంతృప్తిని పోగొట్టిందని ప్రధాని మోడీ తెలిపారు. అభివృద్ధి పథకాల పట్ల వారి విశ్వాసాన్ని పెంచిందన్నారు. ఒకే దేశం-ఒకే గుర్తింపుకు కారణమైన ఆధార్ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, జీఎస్టీ, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా జాతీయ ఐక్యత పెంచామని తెలిపారు. ఇప్పుడు వీటికి కొననసాగింంపుగా ప్రజాస్వామ్య బలోపేతం కోసం జమిలి ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచిన తర్వాత 'ఒకే దేశం, ఒకే రాజ్యాంగం' ప్రతిజ్ఞ నెరవేరినందుకు దేశం సంతోషంగా ఉండని ప్రధాని మోడీ తెలిపారు. సర్దార్ పటేల్ కు ఇదే తమ అతిపెద్ద నివాళి అన్నారు. 70 ఏళ్లుగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయలేదని, రాజ్యాంగం పేరును జపించే వారు ఆయన్ను చాలా అవమానించారన్నారు. దీనికి కారణమైన జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 గోడను బద్దలు కొట్టామన్నారు.












Click it and Unblock the Notifications