Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Doordarshan Logo:వివాదాస్పదంగా దూరదర్శన్ లోగో..అసలేం జరిగింది..?

న్యూఢిల్లీ: దేశ ప్రజలతో లేదా కుటుంబాలతో కొన్ని దశాబ్దాలుగా ముడివేసుకుపోయింది దూరదర్శన్. దూరదర్శన్‌ అనగానే 80వ దశకం, 90వ దశకం వారికి టక్కున గుర్తొచ్చేది సీరియళ్లు, రాత్రి 7 గంటల వార్తలు, చిత్రలహరి, ఆదివారం ఈ ఛానెల్‌లో ప్రసారమయ్యే రామాయణం, మహాభారతం. అప్పట్లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే సూపర్ మ్యాన్ వంటి ఎంటర్‌టెయినింగ్ ప్రోగ్రామ్స్. ప్రైవేట్ ఛానెల్స్ అడుగుపెట్టడంతో ప్రభుత్వ అధీనంలో నడిచే దూరదర్శన్ ఛానెల్ కొన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఈ ఛానెల్ మాత్రం దేశ ప్రజల నుంచి ఎప్పుడూ దూరం కాలేదు. తాజాగా దూరదర్శన్ ఛానెల్ లోగో రంగు మార్పుతో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.

దూరదర్శన్ ఛానెల్ రంగు ఇప్పుడు నీలం నుంచి కాషాయ రంగులోకి మారడం వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలు అన్నీ దీన్ని ఖండించాయి. బీజేపీ రంగులోకి మారడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.దీంతో దేశంలో ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు దూరదర్శన్ ఛానెల్ లోగో రంగు మార్పు అస్త్రంగా మారింది. గతవారం డీడీ ఛానెల్ లోగోను మార్చింది. వెంటనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ డీడీ లోగో రంగును కాషాయం చేయడం వెనుక బీజేపీ కుట్ర ఉందని మండిపడ్డారు.

Controversy Blooms DD News Saffron Logo Ignites Political Firestorm


మమత చేసిన విమర్శలకు కేంద్ర సమాచారా మరియు బ్రాడ్‌క్యాస్టింగ్ మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీకి కాషాయం పట్ల ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే అని చెబుతూ... 1982లోనే లోగో కాషాయం రంగు ఉంటే ఎలా ఉంటుంది అనేదానిపై టెస్ట్ చేయడం జరిగిందని అనురాగ్ ఠాకూర్ గుర్తుచేశారు. మరోవైపు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యా కూడా మమత విమర్శలపై స్పందించారు. భారత్‌లో 1982లో తొలిసారిగా కలర్ టీవీలు వచ్చాయని, అదే ఏడాది దూరదర్శన్‌ జాతీయ ఛానెల్‌గా గుర్తింపు పొందిందని చెప్పుకొచ్చారు. దూరదర్శన్ రూపాంతరం ఎలా చెందిందో పేర్కొంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు.

Controversy Blooms DD News Saffron Logo Ignites Political Firestorm
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+