వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్లు-జంతువులు : ఇది నిజం- జస్ట్ కిడ్సా్ - ఆర్జీవి సంచలన పోస్టు..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్లు అరాచకల పైన అందరూ స్పందిస్తున్నారు. కాబూల్ ను అక్రమించుకున్న తాలిబన్లు అక్కడ వ్యవహరిస్తున్న తీరు పైన పెద్ద ఎత్తున వీడియోలు- ఫొటోలు సోషల్ మీడియా లో షేర్ అవుతున్నాయి. వారి దెబ్బకు ఆఫ్ఘన్లు ప్రాణాలను చేతిలో పెట్టుకొని ఇతర దేశాలకు వెళ్లేందుకు తెగిస్తున్నారు. ఇందు కోసం విమానాల్లో రైళ్ల తరహాలో ఎక్కేందుకు పోటీ పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాల పైన పలువురు సెలబ్రేటీలు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.

ఎప్పుడూ సంచలనాలకు మారు పేరుగా నిలిచే ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ సైతం దీని పైన స్పందించారు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా దైర్యంగా చెప్పే ఆర్జీవీ... తాలిబన్ల తీరుకు సంబంధించి ఒక వీడియో పోస్టు చేసారు. అందులో వారి ప్రవర్తనను తప్పు బట్టారు. చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జాల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించన వీడియోని షేర్‌ చేస్తూ.. వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్‌ చేశారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేసారు.

controvery film director RGV posts on talibans became viral

అలాగే కాబూల్‌లోని ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లిన తాలిబన్లు అక్కడ ఎలక్ట్రిక్ బంపర్ కార్లలో కూర్చొని చిన్న పిల్లలా రైడింగ్ చేస్తూ, ఆడుకుంటూ కేరింతలు కొడుతున్న వీడియో షేర్ చేస్తూ.. 'ఇది నిజం.. తాలీబన్స్ జస్ట్ కిడ్స్' అంటూ ఆర్టీజీ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అక్కడ తాలిబన్ల పాలనతో ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్న స్థానికులు భయం భయంగా ఉన్న సమయంలో తాలిబన్లు కీలక ప్రకటన చేసారు. శాంతి మంత్రం పఠించారు. దేశంలోని ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా.. మహిళలను తమ ప్రభుత్వంలో చేరాల్సిందిగా కోరారు. మహిళలు బాధితుల్లా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావొచ్చు. అయితే, ఇంతవరకు మేం ప్రభుత్వ విధివిధానాలను ఖరారు చేయలేదు. కానీ, ఇస్లామిక్‌ నాయకత్వంలో అన్ని వర్గాలకు ప్రవేశం ఉంటుందని తాలిబన్‌ సాంస్కృతిక కమిషన్‌ను ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనాముల్లా సమంగానీ చెప్పుకొచ్చారు.

అయితే, పలు ప్రాంతాల్లో ప్రజలు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్లల్లోకి వెళ్లి తాలిబన్లు లూటీలకు పాల్పడుతున్నట్లు వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు తాలిబన్లు. ఇంకా ఇళ్లలోకి ప్రవేశించి నగదు లూటీ చేస్తున్నారు. అడ్డు వచ్చిన వారిపై తీవ్రంగా దాడులు చేస్తున్నారని సమాచారం. మరోవైపు, జైళ్లలో బందీగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలు సోషల్ మీడియాలో తాలిబన్లు పోస్టు చేస్తుండటంతో మరింత భయాందోళనలకు కారణమవుతోంది.

English summary
Popular film Diector Ram Gopal Varma Tweet on Talibans is going viral. He says talibans behaved like animals, when they entered the presidential residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X