బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్ టేప్... యడియూరప్పను ఇరికించిన రమేష్ జర్కిహోళి.. సీఎం కుర్చీకే ఎసరు..?

|
Google Oneindia TeluguNews

కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేష్ జర్కిహోళి 'సెక్స్ టేప్' ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ప్రకటించినప్పటికీ... సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. మరోవైపు ఇదే సెక్స్ టేపులో ముఖ్యమంత్రి యడియూరప్పపై రమేష్ జర్కిహోళి చేసిన పలు వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. యడియూరప్ప చాలా అవినీతికి పాల్పడ్డాడని వ్యాఖ్యానించిన జర్కిహోళి... భవిష్యత్తులో ప్రహ్లాద్ జోషి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పడం గమనార్హం.

ప్రహ్లాద్ జోషి కాబోయే సీఎం : రమేష్ జర్కిహోళి

ప్రహ్లాద్ జోషి కాబోయే సీఎం : రమేష్ జర్కిహోళి

మహిళ : బెల్గాంలో మరాఠీలు,కన్నడిగులు ఎప్పుడూ గొడవలు పడుతుంటారు కదా?

రమేష్ జర్కిహోళి : మరాఠీలు చాలా మంచివారు. కన్నడిగులకే ఏ పనీ పాటా లేదు.

జర్కిహోళి : సిద్దరామయ్య చాలా మంచివారు. కానీ యడియూరప్ప చాలా అవినీతి చేశాడు.

మహిళ : మీరు తరుచూ ఢిల్లీ వెళ్తున్నారు... సీఎం కాబోతున్నారా...?

జర్కిహోళి : నేను కాదు ప్రహ్లాద్ జోషి సీఎం కాబోతున్నారు.

ప్రతిపక్షాలకు అస్త్రంగా... టార్గెట్ యడ్డీ...

ప్రతిపక్షాలకు అస్త్రంగా... టార్గెట్ యడ్డీ...

రమేష్ జర్కిహోళి చేసిన వ్యాఖ్యలు యడియూరప్పను ఇరుకునపెట్టేవిగా మారాయి. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ... 'ఇది కేవలం సెక్స్ స్కాండల్ మాత్రమే కాదు. ఆ మంత్రి ముఖ్యమంత్రి యడియూరప్ప గురించి మాట్లాడుతూ ఆయన అవినీతిపరుడని చెప్పాడు. దీనికి సీఎం జవాబు చెప్పాలి. బంతి ఇప్పుడు వాళ్ల కోర్టులోనే ఉంది. నాకు తెలిసి బీజేపీ అధిష్టానం సరైన నిర్ణయమే తీసుకుంటుందని భావిస్తున్నాను.' అని డీకె శివకుమార్ వ్యాఖ్యానించారు. అంటే,అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించాలని డీకె శివకుమార్ పరోక్షంగా డిమాండ్ చేసినట్లు కనిపిస్తోంది.

యడియూరప్పను దించేందుకు...

యడియూరప్పను దించేందుకు...

నిజానికి యడియూరప్పను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించబోతున్నారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. అవినీతి ఆరోపణలు,వయసు పైబడటంతో చురుగ్గా పనిచేయలేకపోతున్నారన్న విమర్శలు, కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇచ్చారని సొంత గూటి నేతల్లో నెలకొన్న అసంతృప్తి... వెరసి యడియూరప్పను కుర్చీ నుంచి దించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం ఆ పార్టీ నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం కూడా చేశారు.

సీఎం కుర్చీకే ఎసరు...

సీఎం కుర్చీకే ఎసరు...

గత నెలలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ కూడా యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి తప్పించబోతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉగాది తర్వాత రాష్ట్రంలో యడియూరప్ప స్థానంలో కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన అన్నారు. తాజాగా లీకైన సెక్స్ టేపులో రమేష్ జర్కిహోళి 'ప్రహ్లాద్ జోషి' సీఎం కాబోతున్నారని అన్నారు. ఇవన్నీ గమనిస్తే యడ్డీని సీఎం కుర్చీ నుంచి దించేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇదే టేపులో యడ్డీపై రమేష్ జర్కిహోళి చేసిన అవినీతి ఆరోపణలు అటు ప్రతిపక్షంతో పాటు ఇటు సొంత పార్టీలోని యడ్డీ వ్యతిరేక వర్గానికి అస్త్రంలా మారాయని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం అటు తిరిగి,ఇటు తిరిగి చివరకు యడియూరప్ప సీఎం కుర్చీకి ఎసరు పెట్టేలా మారిందన్న చర్చ జరుగుతోంది.

English summary
Amid controversy in Karnataka over a CD involving Ramesh Jarkiholi, what has left BJP red-faced is the alleged conversation between the former minister and the woman in the sex tape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X