ఐటి ఉద్యోగులే టార్గెట్, దోపిడీ: ముఠా సభ్యుల పట్టివేత

Cops Arrest Two Gang Members Who Robbed Only IT Employees
పూణే: మహారాష్ట్రలోని పూణేలో ఐటి ఉద్యోగులకు దోపిడీ ముఠా తిప్పలు తప్పాయి. నగరంలోని ఐటి కంపెనీల ఉద్యోగులను దోపిడీ చేసిన ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. హింజేవాడీ, వాకడ్ ప్రాంతంలో ముంబై పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఐటి ఉద్యోగులను దోచుకున్న ముఠాలోని ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

అరెస్టయిన దోపిడీ ముఠా అనుమానితుల్లో ఒకతను ఖలీద్ అహ్మద్ షేక్ (32) సతారా జిల్లాలోని కన్హేరీ ఖందాలాకు చెందినవాడు కాగా, నితాంత్ గిరీష్ పవార్ (23) అనే మరొకతను పూణేలోని నవీ సంగ్వీకి చెందినవాడు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

పరారీలో ఉన్న ఒకతన్ని పూణేలోని పింపుల్ గురువ్‌ ప్రాంతంలోని సలీం పాపా షేక్‌గా గుర్తించారు. వాళ్లంతా పాత నేరస్థులే. పోలీసులు నిందితుల నుంచి రెండు కార్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు దోపిడీల్లో తమ పాత్రను ఇద్దరు కూడా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

దోపిడీ కేసుల్లో నిందితులు షేక్, పవార్ ఐటి కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేశారు. ముంబైకి వెళ్లే దారిలో నిలబడేవారికి వాళ్లు లిఫ్ట్ ఇస్తుండేవారు. తమను ప్రయాణికులుగా చెప్పుకుని వారు వాహనాల్లో ఎక్కించుకునేవారు. వారు కారులో ఎక్కగానే వెనక ప్రయాణికుల మాదిరిగా కూర్చున్నవారు వారిని కొట్టేవారు. పదునైన ఆయుధాలతో బెదిరించేవారు. వారి వద్ద ఉన్నవాటిని దోచుకుని నిర్మానుష్యంగా ఉన్న చోట రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+