128 కి.మీ వేగం, గూడ్స్ బండిలో ఇనుప ఖనిజం- ప్రమాద తీవ్రత పెరగడానికి కారణాలివే

న్యూఢిల్లీ: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. 288కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది. వారంతా బాలాసోర్ సహా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.

హౌరా- చెన్నై మార్గంలో పట్టాల పునరుద్ధరణ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పట్టాల పునరుద్ధరణ, రెస్క్యూ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోన్నారు. ఈ మధ్యాహ్నం 12:05 నిమిషాలకు డౌన్ మెయిన్ లైన్‌ను పునరుద్ధరించారు. ఈ మార్గంలో ఈ సాయంత్రానికి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

 odissatrianaccident-

పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.

లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ బండిని ఢీ కొట్టే సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగం 128 కిలోమీటర్లుగా తేలింది. ఆ రైలు ఢీ కొట్టిన గూడ్స్ బండి ర్యాక్స్ నిండా ఇనుప ఖనిజం ఉంది. ఈ రెండు కారణాల వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు రైల్వే బోర్డ్ తెలిపింది. ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బేరీజు వేసుకుని చూశామని, సిగ్నలింగ్‌లో కూడా కొంత సమస్య ఉందనే నిర్ధారణకు వచ్చామని తెలిపింది.

రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి వివరణాత్మక నివేదిక ఇంకా అందాల్సి ఉందని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయవర్మ సిన్హా తెలిపారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన తరువాత గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదని ఆమె వివరించారు. గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉన్నందున ప్రమాద తీవ్రత పెరిగిందని, భారీ సంఖ్యలో మరణాలకు దారి తీసిందని పేర్కొన్నారు.

గూడ్స్ బండిని ఢీ కొట్టిన తరువాత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు డౌన్‌లైన్‌పై చెల్లాచెదురుగా పడ్డాయని, అదే సమయంలో 126 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొట్టిందని జయవర్మ సిన్హా తెలిపారు. పునరుద్ధరణ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ రెండు రైల్వే లైన్లు కూడా ఈ రాత్రి 8 గంటలకు అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఈ మార్గాన్ని పునరుద్ధరించాల్సి వచ్చినందున ఈ మార్గంలో రైళ్లు తక్కువ వేగంతో నడుస్తాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+