దేవుడా: కొడుకు జాడ కోసం మృతదేహాల మధ్య తండ్రి అన్వేషణ..!!
భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 288కి చేరింది. 1,000 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గూడ్స్ రైలును ఢీ కొని పట్టాలు తప్పింది. ఈ ఘటనలో బోగీలన్నీ చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న హౌరా- యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలపై పడిన గూడ్స్ ర్యాక్స్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు, సహాయక సిబ్బంది బాలాసోర్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. గాయపడ్డ వారి సంఖ్య 1,000గా సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు నిర్ధారించారు. వారికి యుద్ధ ప్రాతిపదికన చికిత్స అందిస్తోన్నామని, దీనికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారిని మరింత మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్, కటక్‌కు తరలించారు.
Heartbreaking and sad to see this heartbreaking .
— Rajeev Kumar Sharma (@RajeevK78325493) June 3, 2023
Father searching for his Son among deadbodies.#BalasoreTrainAccident#train_accident #CoromandalExpressAccident#CoromondalExpress #RailwayMinister #IndianRailways #IndianRailway pic.twitter.com/Y2W46qOMpj
సంఘటన స్థలంతో పాటు, బోగీల నుంచి వెలికి తీసిన మృతదేహాలను పోలీసులు, సహాయక సిబ్బంది బాలాసోర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మినీ టెంపుల్లో వాటిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆవరణలో గల షెడ్‌లో వాటిని ఉంచారు. గుర్తించిన మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగిస్తోన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు, ఆర్తనాదాలతో బాలాసోర్ ఆసుపత్రిలో విషాదకర ఛాయలు అలముకున్నాయి.
తన కుమారుడి జాడ కోసం షెడ్‌లో ఉంచిన మృతదేహాల మధ్య ఓ తండ్రి అన్వేషిస్తోండటం గుండెలను తడి చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చాడని, మధ్యాహ్నం వరకు జాడ తెలియరాలేదని ఆ వ్యక్తి వాపోయాడు. భద్రక్ జిల్లాలోని షిగ్గో అనే గ్రామం నుంచి వచ్చానని చెప్పాడా వ్యక్తి. కొడుకు కనిపించట్లేదనే విషయం పోలీసులకు తెలియజేశానని, వెదకడానికి సహకరించాలంటూ అతను ప్రాధేయపడటం కలచివేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications